ఫ్యాక్ట్ చెక్: 'దేవుడి వస్త్రం అక్షింతలు పడవు అనుకుంటా మన ముఖ్యమంత్రికి' అంటూ ఏపీ సీఎం జగన్ గురించి తప్పుడు ప్రచారం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవం ఉత్సవాలు 2023, సెప్టెంబర్ 18న తిరుమల ఆలయంలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26, 2023 వరకు కొనసాగనున్నాయి. ఆచార వ్యవహారాలలో భాగంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి;

Update: 2023-09-22 10:54 GMT

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవం ఉత్సవాలు 2023, సెప్టెంబర్ 18న తిరుమల ఆలయంలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26, 2023 వరకు కొనసాగనున్నాయి. ఆచార వ్యవహారాలలో భాగంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ క్రతువులో భాగంగా టీటీడీ అర్చకులు సీఎంకు అక్షతలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన జుట్టును సరిదిద్దుకుంటున్న వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. “దేవుడి వస్త్రం అక్షింతలు పడవు అనుకుంటా మన ముఖ్యమంత్రికి” అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్షింతలు పడవంటూ ఓ వర్గం దీనిపై ప్రచారం చేస్తూ ఉంది.
Full View

Full View


ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఏపీ సీఎం తన వెంట్రుకల్లోని అక్షింతలను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. జుట్టు సరిగ్గా ఉండేలా దువ్వుకున్నారు.

టీటీడీ బ్రహ్మోత్సవాల గురించి మేము మరిన్ని వీడియోల గురించి వెతికాం. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను కూడా మేము పరిశీలించాం. ఆ వీడియోలలో కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల మీద వస్త్రాన్ని చుట్టుకోవడం కోసం జుట్టును సవరించుకున్నారు.

మేము టిటిడి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరిన్ని వీడియోలను సెర్చ్ చేశాం. తలకు చుట్టుకున్న వస్త్రాన్ని తీసివేసిన తర్వాత AP CM తన జుట్టును సర్దుబాటు చేస్తున్నట్లుగా చూపించే వీడియోలను మేము కనుగొన్నాము. ఏపీ ప్రభుత్వం తరపున శ్రీవేంకటేశ్వర స్వామికి సమర్పించాల్సిన దుస్తులను ఆయన తీసుకువెళుతుండగా ఆ వస్త్రం తలకు చుట్టారు. ఇది ఆచారంలో ఒక భాగం. సిఎం జగన్ స్వామివారికి 'పట్టు వస్త్రాలు' సమర్పించారు.

ఈ క్రతువు పూర్తయ్యాక టీటీడీకి చెందిన అర్చకులు సీఎం జగన్ ను ఆశీర్వదించారు. ఆశీర్వాదం ప్రారంభమయ్యే ముందు తన జుట్టును సీఎం జగన్ సవరించుకున్నారు.
Full View
సెప్టెంబర్ 19, 2023న సాక్షి టీవీ ప్రచురించిన సుదీర్ఘ వీడియో ఇక్కడ ఉంది.
Full View
మరింత సెర్చ్ చేసినప్పుడు, ముఖ్యమంత్రి తన జుట్టును పదేపదే సవరించుకున్నట్లు చూపించే మరికొన్ని వీడియోలు మాకు కనిపించాయి.
Full View
సీఎం జగన్ అతను తన జుట్టును సవరించుకుంటూ కనిపించిన వివిధ సందర్భాలకు సంబంధించిన వీడియోలను కూడా మేము కనుగొన్నాము.
Full View
కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల మీద అక్షింతలు కూడా ఉంచుకోవడం లేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim :  Andhra Pradesh Chief Minister trying hard to remove akshatalu showered as a blessing by Tirumala priests
Claimed By :  Social media user
Fact Check :  Misleading
Tags:    

Similar News