నిజ నిర్ధారణ: రోడ్డుపై స్కిడ్ అయ్యి కారు గాలిలో పల్టీలు కొట్టిన వీడియో మధ్యప్రదేశ్‌కి చెందినది, ఆంధ్రప్రదేశ్‌ది కాదు.

వేగంగా వెళ్తున్న కారు గాలిలో బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి పల్టీలు కొట్టడం వీడియోలో చూడవచ్చు. కారు నీటీతో నిండి ఉన్న రోడ్డుపై వెళ్తుండగా, ఈ సంఘటన జరిగింది.

Update: 2022-09-02 11:37 GMT

వీడియోలో చూపిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని పేర్కొంటూ ఫేస్‌బుక్ రీల్ రూపంలో వీడియోను షేర్ చేసారు. వేగంగా వెళ్తున్న కారు గాలిలో బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి పల్టీలు కొట్టడం వీడియోలో చూడవచ్చు. కారు నీటీతో నిండి ఉన్న రోడ్డుపై వెళ్తుండగా, ఈ సంఘటన జరిగింది.

షేర్ చేసిన వీడియో తెలుగు క్యాప్షన్ ఇలా ఉంది, "వర్షం కాలంలో ఏ.పి.రోడ్లపై జాగ్రత్త వహించాలి".

https://www.facebook.com/reel/1088386841817744?s=cl&fs=e

ఆర్కైవ్ లింకు:

https://web.archive.org/web/20220901143500/https://www.facebook.com/login.php?next=https://www.facebook.com/reel/1088386841817744?s=cl&fs=e

నిజ నిర్ధారణ:

వీడియోలో కనిపిస్తున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుందన్న వాదన అవాస్తవం. మధ్యప్రదేశ్ లోని చింద్వారా-నాగ్‌పూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై జారి పల్టీలు కొట్టింది.

వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, ఒక ఫేస్‌బుక్ వినియోగదారు హిందీలో ""#मध्यप्रदेश के #छिंदवाड़ा में इस तरह पलटी खाई गाड़ी I" అనే కధనంతో అదే వీడియోను షేర్ చేసినట్టు తెలుస్తోంది.

అనువదించగా "మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కారు గాలిలో పల్టీలు కొట్టింది"

Full View

దీన్ని క్యూగా తీసుకుని, "మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో స్పీడింగ్ కార్" అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, ఆగస్టు 28, 2022న నాగ్‌పూర్‌లో న్యూస్ నేషన్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ప్రవీణ్ ముధోల్కర్ చేసిన ట్వీట్‌ని లభించింది.

"మధ్యప్రదేశ్ మీదుగా #చింద్వారా - #నాగ్‌పూర్ హైవేపై లింగ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా బోల్తా పడింది, దానిలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై వర్షం నీరు నిలవడంతో కారు అకస్మాత్తుగా అదుపుతప్పి గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలంలోకి దూకడం వీడియోలో కనిపిస్తోంది.

ఈ సంఘటనను కొన్ని వార్తా వెబ్‌సైట్‌లు కూడా నివేదించాయి, ఇవి వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై నిలిచిన నీటిలో నియంత్రణ తప్పి హైవే పక్కన ఉన్న పొలంలో బోల్తా పడింది, పొలంలో మేస్తున్న ఆవుకి అది అంగుళాల దూరంలో ఆగింది అని ప్రచురించాయి.

ఈటీవీభారత్ ప్రచురించిన వివరాల ప్రకారం.. లింగ బైపాస్‌లో భారీ నీటి ఎద్దడి కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను చుట్టుపక్కల ఉన్నవారు రికార్డ్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

అందుకే, ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించారు, క్లెయిమ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కాదు. వాదన అబద్దం.

Claim :  Video of car flipping into the air due to waterlogging is from Andhra Pradesh
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News