ఫ్యాక్ట్ చెక్: ప్రజలను పోలీసులు కొట్టిన వీడియో తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఉత్తరప్రదేశ్ కు సంబంధించినది కాదు.. మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన

యువకులపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టిన వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినదని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారంలో ఉంది. అక్కడ రోడ్లపై నమాజ్ చేస్తున్న వారిని పోలీసులు కొట్టారు. ముఖ్యమంత్రి యోగి హయాంలో రోడ్లపై నమాజ్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అందుకే బీజేపీకి ఓటు వేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.;

Update: 2023-12-30 09:26 GMT
Uttar Pradesh Police, Yogi Adityanath, Madhya Pradesh, Jabalpur, Namaz

Uttar Pradesh Police

  • whatsapp icon

యువకులపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టిన వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినదని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారంలో ఉంది. అక్కడ రోడ్లపై నమాజ్ చేస్తున్న వారిని పోలీసులు కొట్టారు. ముఖ్యమంత్రి యోగి హయాంలో రోడ్లపై నమాజ్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అందుకే బీజేపీకి ఓటు వేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

“ఇది చూడటం చాలా ఆనందంగా ఉంది” అనే క్యాప్షన్‌తో వైరల్ వీడియోను షేర్ చేస్తున్నారు. మతోన్మాదులను నిర్మూలించాలని యోగీజీ అనుకుంటున్నారు. అందుకోసం బీజేపీకి ఓటు వేయండి!” అంటూ పోస్టులు పెడుతున్నారు. పోలీసులు యువకులను కొట్టడం, గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ విడుదల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

“Such joy to see this. Yogi ji need of the hour to set straight religious fanatics. NEW RULES Vote for BJP!” అంటూ పోస్టులు పెట్టారు.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినది, ఉత్తరప్రదేశ్ తో ఎటువంటి సంబంధం లేదు. 2021లో ఈ వీడియోను చిత్రీకరించారు.

వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లపై Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అక్టోబర్ 19, 2021న MP Tak ప్రచురించిన నివేదికను మేము కనుగొన్నాము. "జబల్‌పూర్‌లో మతపరమైన ఊరేగింపులో రాళ్లదాడి జరిగింది, దుండగులను పోలీసులు బలవంతంగా తరిమికొట్టారు" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

వీడియో వివరణలో “మిలాదున్నబీ ఊరేగింపుకు సంబంధించి జబల్‌పూర్‌లో వివాదం మొదలైంది. ఊరేగింపుగా వెళ్తున్న జనం పోలీసులపైకి బాణాసంచా విసిరారు. అనంతరం రాళ్లు రువ్వారు." అని తెలిపారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అంతకుముందు అదే రోజు ఉదయం కూడా రద్దీ చౌకీ వద్ద ఇదే విధమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది, అయితే పోలీసులు వెంటనే ఈ విషయాన్ని పరిష్కరించారు. గంటన్నర పాటు ఉద్రిక్తత కొనసాగింది.

Full View

MP tak అప్‌లోడ్ చేసిన వీడియోకు, వైరల్ వీడియోకు సంబంధించిన ఘటనలకు సంబంధించి స్క్రీన్‌షాట్‌ల పోలికను మీరు చూడొచ్చు.

అక్టోబర్ 20, 2021న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఈద్ మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా చెలరేగిన అల్లర్లను నియంత్రించడానికి మధ్యప్రదేశ్ పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు షెల్‌లను ప్రయోగించారు. జబల్‌పూర్‌లో పోలీసు సిబ్బందిపై టపాసులు, రాళ్లు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు జనాన్ని నియంత్రించడానికి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.

కాబట్టి, వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కి చెందినది కాదు. ఇటీవలిది కాదు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినది. 2021లో చిత్రీకరించిన వీడియో అని మేము గుర్తించాం.
Claim :  Policemen thrashing people offering Namaz on the road in Uttar Pradesh
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News