ఫ్యాక్ట్ చెక్: పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో సర్కస్ ను వీక్షిస్తూ ఉన్నారనేది తప్పుదోవ పట్టించే వాదన
పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో సర్కస్ ను చూస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో సర్కస్ ను చూస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో కింద క్యాప్షన్ లో "క్రైస్తవం అన్నది దిగజారిపోయింది.. అశ్లీలమైన డ్యాన్స్ లతో కూడిన ప్రదర్శనను పోప్ చూస్తున్నారు.. త్వరలో ఈ పోప్ స్థానంలో మరొకరు వస్తారు.." అంటూ పోస్టులు పెడుతున్నారు.
వాటికన్ సిటీ సర్కస్ చూసే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ప్రకాశవంతమైన దుస్తులలో నృత్యం చేయడం, పోప్ వారిని చూస్తున్నట్లుగా వైరల్ వీడియో ఉంది. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో సర్కస్ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది.
“The Vatican has fallen” అనే క్యాప్షన్ తో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వీడియో 2020 సంవత్సరానికి సంబంధించినది. వాటికన్‌లో సర్కస్ బృందం ప్రదర్శనలను ఏర్పాటు చేయడం పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించినది కాదు. సర్కస్ బృందం ప్రదర్శనను చూసే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాల క్రితం పోప్ సెయింట్ పాల్ VI ద్వారా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
మేము "సర్కస్ ఇన్ ది వాటికన్ సిటీ" వంటి కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేయగా.. వాటికన్ సిటీలో 2012 నాటి సర్కస్ ప్రదర్శనలను చూపించే అనేక వీడియోలను కనుగొన్నాం.
పోప్ బెనెడిక్ట్ XVI పర్యవేక్షణలో కూడా వాటికన్‌లో సర్కస్ ప్రదర్శన నిర్వహించిన వీడియోకు సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది.
"ఆక్వా సర్కస్" నివేదిక ప్రకారం పోప్, వాటికన్ కు వచ్చిన ప్రజల కోసం ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలలో
పోప్ ఫ్రాన్సిస్ కనిపించారు. పర్యావరణాన్ని రక్షించే విషయాన్ని తెలియజేసే ఓ సర్కస్ ప్రదర్శన ఇది. ఈ సర్కస్ కు 'సిర్క్యూ డు సోలైల్' అనే పేరు పెట్టారు. పర్యావరణాన్ని రక్షించే విషయాన్ని అందులో చూపించారు. సముద్రపు కలుషితానికి వ్యతిరేకంగా పోరాడే మత్స్యకన్యకు సంబంధించిన విషయాలను అందులో చూపించారు.
వైరల్ వీడియో 2020 సంవత్సరానికి చెందినది, ఇది రోమ్ రిపోర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. రోమ్ రిపోర్ట్స్ అనేది అంతర్జాతీయ వార్తా సంస్థ, ఇది పోప్, వాటికన్ కార్యకలాపాలను నివేదిస్తూ ఉంటుంది. ఇది సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉంటారు.
అదే యూట్యూబ్ ఛానెల్‌లో రోనీ రోలర్ సర్కస్ ప్రదర్శన వీడియోను కూడా చూడవచ్చు. జనవరి 2022లో వీడియోను అప్లోడ్ చేశారు.
Pillarcatholic.com ప్రకారం, వాటికన్ లోని ఒక మంత్రిత్వ శాఖలో భాగంగా సర్కస్ బృందాలను స్వాగతిస్తూ ఉంటారు. 1970లో, పోప్ సెయింట్ పాల్ VI కొత్త వాటికన్ కార్యాలయాన్ని స్థాపించారు. వలసదారులు, ప్రయాణీకుల ఆధ్యాత్మిక సంరక్షణపై పోంటిఫికల్ కమిషన్ కూడా ఉంది.
కాంగ్రెగేషన్ ఫర్ బిషప్ అంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం శరణార్థులకు, సంచారులకు, నావికులకు, పైలట్‌లకు, ప్రవాసులకు చర్చి మతసంబంధమైన విషయాలను తెలియజేయడానికి ఉద్దేశించబడింది. ప్రత్యేకంగా సర్కస్ ప్రదర్శనల కోసం ప్రయాణించే వ్యక్తుల కోసం కూడా దీన్ని ఏర్పాటు చేశారు.
వైరల్ వీడియో 2020 నాటిది. వాటికన్ లో సర్కస్ బృందాలను ప్రోత్సహించే సంప్రదాయాన్ని పోప్ పాల్ VI ప్రారంభించారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Pope has started a new tradition of circus in the Vatican City
Claimed By : Social media users
Fact Check : Misleading