ఫ్యాక్ట్ చెక్: అమెరికాకు చెందిన కార్గో షిప్ మంటల్లో ఉన్న వీడియోకు.. ఇటీవల యెమెన్ రెబల్ గ్రూప్ హౌతీ క్షిపణి దాడికి ఎలాంటి సంబంధం లేదు
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జనవరి 15, 2024న అమెరికాకు చెందిన కంటైనర్ షిప్‌పై యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని US మిలిటరీ పేర్కొంది
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జనవరి 15, 2024న అమెరికాకు చెందిన కంటైనర్ షిప్‌పై యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని US మిలిటరీ పేర్కొంది. ఈ సంఘటన తర్వాత కూడా ఏడెన్ గల్ఫ్ ఓడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని యెమెన్ రెబల్ గ్రూప్ ప్రకటించింది.
యెమెన్ తీరంలో ఇటీవల క్షిపణి దాడిలో అమెరికాకు చెందిన కార్గో షిప్ మంటల్లో ఇరుక్కుపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఒక భారీ కార్గో షిప్ మంటల్లో కాలిపోతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది.
“WW3 HIGH ALERT. A US-owned cargo ship was just hit by a missile off the coast of Yemen. The United Kingdom Maritime Trade Operations security agency reported it as a "vessel hit from above by a missile" on its website." అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని.. అమెరికాకు చెందిన కార్గో షిప్ పై యెమెన్ రెబల్స్ దాడి చేశారని ఈ పోస్టులలో ఆరోపించారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో శ్రీలంకలోని కొలంబో తీరంలో మే 2021లో పేలిన కంటైనర్ షిప్ చూపిస్తుంది.
వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ‘The Sun’ యూట్యూబ్ ఛానల్ లో ‘Explosion on burning container ship carrying Nitric acid’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారని మేము గమనించాం. మే 25, 2021న వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాం. కాబట్టి వైరల్ వీడియో ఇటీవలిది కాదని మేము గుర్తించాం. కంటైనర్ షిప్ లో నైట్రిక్ యాసిడ్ కారణంగా పేలుడు సంభవించినట్లు టైటిల్ ద్వారా తెలుస్తోంది.
వీడియో వివరణలో.. 25 టన్నుల నైట్రిక్ యాసిడ్‌తో కూడిన కంటైనర్ లో మంటలు చెలరేగాయి. శ్రీలంకలోని కొలంబో నౌకాశ్రయంలోని కంటైనర్ షిప్‌లో ఈ పేలుడు సంభవించింది. X ప్రెస్ పెర్ల్ నౌక నుండి వచ్చిన నల్లటి పొగ ఆ ప్రాంతాన్నంతా చుట్టేసింది. మే 20, గురువారం నాడు మొదట మంటలు చెలరేగాయి.
సింగపూర్ డైలీ మిర్రర్ ప్రకారం ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని మొత్తం 25 మంది సిబ్బందిని ఖాళీ చేయించారు. ఇద్దరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ పేలుడు కారణంగా అనేక కంటైనర్లు సముద్రంలోకి పడిపోయాయని మిర్రర్ తెలిపింది. సింగపూర్ జెండాతో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్‌తో సహా సౌందర్య సాధనాలు, రసాయనాలను తీసుకెళ్తున్న MV X-Press Pearl అనే కంటైనర్ నౌక కొలంబో నౌకాశ్రయం వద్ద లంగరు వేయగా, దానిపై ఉన్న కంటైనర్‌లో మంటలు చెలరేగాయి.
SNP షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఫేస్‌బుక్ పేజీలో కూడా ఓడ మంటల్లో చిక్కుకున్న వీడియోను షేర్ చేసింది.“Explosion reported from inside the container vessel MV X-Press Pearl off Sri Lanka. All 25 crew members evacuated safely out of the vessel” అనే క్యాప్షన్ తో మే 26, 2021న వీడియోను పోస్టు చేశారు. శ్రీలంకలో MV X-ప్రెస్ పెర్ల్ అనే కంటైనర్ నౌక లో పేలుడు సంభవించింది. మొత్తం 25 మంది సిబ్బంది ఓడ నుంచి సురక్షితంగా బయటపడ్డారు
మే 25, 2021న అల్జజీరాలో ప్రచురించిన నివేదిక ప్రకారం, శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలో లంగరు వేసిన ఓడలో పేలుడు సంభవించడంతో సిబ్బందిని ఖాళీ చేయించారు. MV X-Press Pearl అనే కంటైనర్ నౌక కొలంబోకు వాయువ్యంగా 9.5 నాటికల్ మైళ్లు (18km) దూరంలో లంగరు వేశారు. నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి వేచి ఉన్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించిందని శ్రీలంక నేవీ తెలిపింది.
సింగపూర్ జెండాతో కూడిన ఓడలో రసాయనాలు రవాణా చేయడం వల్లే మంటలు చెలరేగాయని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓడలో 1,486 కంటైనర్లు ఉన్నాయి, అందులో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలు మే 15 న భారతదేశంలోని హజీరా ఓడరేవులో లోడ్ చేశారు. నౌకలోని 25 మంది సభ్యుల సిబ్బందిలో ఫిలిప్పైన్, చైనీస్, భారతీయ, రష్యన్ జాతీయులు ఉన్నారు.
2021 సంవత్సరంలో శ్రీలంక తీరానికి సమీపంలో సింగపూర్ ఓడలో జరిగిన పేలుడును.. ఇటీవల యెమెన్ తిరుగుబాటుదారులు అమెరికాకు చెందిన కంటైనర్ షిప్‌పై దాడి చేశారనే వాదనతో జరుపుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

Claim : Viral video shows US-owned cargo ship hit by a missile attack by the Yemen rebel group Houthi near the Yemen coast
Claimed By : Social media users
Fact Check : False