ఈ వీడియోలోని అలంకరణ తిరుమల ఆలయాం లోనిదా?? కాదు
ఆంధ్రప్రదేశ్ తిరుమల లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పువ్వులకు బదులు కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు చెపుతూ ఒక ఆలయ ప్రాంగనాన్ని చూపించే వీడియో ప్రచారంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ తిరుమల లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పువ్వులకు బదులు కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు చెపుతూ ఒక ఆలయ ప్రాంగనాన్ని చూపించే వీడియో ప్రచారంలో ఉంది.
ఈ దావా ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లోనూ వైరల్ అయ్యింది.
హిందీ లో దావా, ""तिरुपति बालाजी मंदिर आंध्र प्रदेश में फूलों की जगह भारतीय नोटों से हुई सजावट की अनोखी कारीगरी की झलक"
ఈ దావా అబద్దం.
గుడిలోని విగ్రహాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇది తిరుమల బాలాజీకి చెందినది కాదని చెప్పవచ్చు, ఎందుకంటే వైరల్ వీడియోలో కనిపించే విగ్రహంతో పోలిస్తే తిరుమల బాలాజీ విగ్రహం పెద్దగా ఉంటుంది. ప్రధాన విగ్రహం ముందు చిన్న సింహం విగ్రహం ఉండటం కూడా మనం వీడియోలఒ చూడవచ్చు, తిరుమలలోని విగ్రహం చుట్టూ అటువంటి సింహ విగ్రహాలు లేవు కాబట్టి ఆ విగ్రహం తిరుమల వెంకటేశ్వర స్వామిది కాకపోవచ్చు.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో షేర్ చేయబడిన కొన్ని సోషల్ మీడియా లింక్‌లను మేము కనుగొన్నాము. "నెల్లూరు వాసవి దేవాలయం.... 5 కోట్ల తాజా నోట్లతో అలంకరణలు" అంటూ అక్టోబర్ 14, 2021న ట్విట్టర్‌లో వీడియో షేర్ చేయబడింది.
అక్టోబరు 12, 2021న ఇండియా ఎహెడ్ న్యూస్ షేర్ చేసిన మరో వీడియోలో, డెకరేషన్ యొక్క ఇంకో కోణాన్ని మనం చూడవచ్చు. వీడియో టైటిల్‌లో "ఆంధ్రా దసరా: దసరా సందర్భంగా నెల్లూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని అలంకరించేందుకు 5 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లు ఉపయోగించబడ్డాయి"
ఈ ఆధారాలు తీసుకొని, "నెల్లూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరెన్సీ అలంకరణ" అనే కీవర్డ్‌లతో శోధించగా, తెలుగు స్థానిక వార్తల వెబ్‌సైట్‌ల ప్రచురించబడిన ఎన్నో శీర్షికలు దొరికాయి.
నెల్లూరు జిల్లాలోని శ్రీ వాసవీ మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2021 లో జరిగిన దసరా వేడుకలలో తీసిన వీడియో ఇది.
https://www.dishadaily.com/ammavaru-decoration-with-rs-5-crore-currency-in-nellore
విగ్రహాన్ని, ఆలయాన్నీ రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 మరియు రూ. 10 నోట్లతో అలంకరించారు. ఆలయాన్ని అలంకరించేందుకు 100 మందికి పైగా వాలంటీర్లు గంటల తరబడి శ్రమించారు.
అయితే, కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించడం ఇది మొదటి సారి మాత్రం కాదు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రూ. 1,11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు. 2017లో, ఆలయ కమిటీ 3,33,33,333 రూపాయల కరెన్సీ నోట్లతో ఇదే విధమైన ఏర్పాటలు చేసింది.
ఆంధ్రజ్యోతి.కామ్ లో ప్రచురించబడిన మరొక నివేదిక మనం చూడవచ్చు, వైరల్ వీడియో లోని దృశ్యాలను ఈ చిత్రాలు పోలి ఉండడం మనం చూడవచ్చు.
అందువల్ల, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలోని వెంకటేశ్వర విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారనే వాదన అబద్దం.
ఈ అలంకరణ నెల్లూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగినది. 2021 అక్టోబర్‌లో దసరా సందర్భంగా ఆలయాన్ని రూ. 5 కోట్లతో అలంకరించారు, అప్పుడు తీసిన వీడియో తప్పుడు కధనం తో ప్రాచుర్యంలోకి వచ్చింది.