ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తి వేలును నరికేసుకుంటున్న వీడియో కర్ణాటకకు చెందినది కాదు మహారాష్ట్రకు సంబంధించినది
ఒక వ్యక్తి తన చేతి బొటన వేలిని నరికేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడమే తన పెద్ద తప్పు అని భావిస్తున్నాడని.
ఒక వ్యక్తి తన చేతి బొటన వేలిని నరికేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడమే తన పెద్ద తప్పు అని భావిస్తున్నాడని.. అందుకే వేలిని కోసుకుంటున్నాడని పోస్టులు వైరల్ చేస్తున్నారు.
“కర్నాటకలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు చూసి కుపితుడయ్యాడు. కర్ణాటక వాసి అయిన ఇతను ఏం చేశాడు మీరే చూడండి! విడియో చూస్తే మీకూ వణుకు పుడుతుంది. బీజేపీని కాదని ఉచితాలకు ఆశపడి *"కాంగ్రెస్‌కి" బుద్ధితక్కువగా ఓటు వేయడం* నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు.. అందుకే కర్నాటక ఎన్నికల్లో *"కాంగ్రెస్‌కి"* ఏ వేలితో అయితే ఓటేశానో, అదే వేలును ఇప్పుడు మేముందే నరికేసుకుంటున్నాను అని చెప్పి వీడియో తీస్తూ మరీ వేలిని నరికేసుకున్నాడు!
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇలాంటిదే... *"అడుసు త్రొక్కనేల, కాలు కడగానేల"* అని పెద్దలు ముందుగానే ఒక నానుడి ద్వారా హెచ్చరించారు... ఈ దుస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఓటర్లకు రానే కూడదు. అందుకే ముందుగానే చెప్తున్నాము, జాగ్రత్త పడండి.. అడ్వాన్సుగానే చెప్తున్నాము...హిందుత్వాన్ని రక్షించే బీజేపీ మాత్రమే మిమ్మల్ని కాపాడ గలదు...ఇది నిజం”
ఇలా పలు రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇలాంటిదే... *"అడుసు త్రొక్కనేల, కాలు కడగానేల"* అని పెద్దలు ముందుగానే ఒక నానుడి ద్వారా హెచ్చరించారు... ఈ దుస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఓటర్లకు రానే కూడదు. అందుకే ముందుగానే చెప్తున్నాము, జాగ్రత్త పడండి.. అడ్వాన్సుగానే చెప్తున్నాము...హిందుత్వాన్ని రక్షించే బీజేపీ మాత్రమే మిమ్మల్ని కాపాడ గలదు...ఇది నిజం”
ఇలా పలు రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. తన సోదరుడు, అతడి భార్య ఆత్మహత్య కేసుకు సంబంధించి, పోలీసుల వైఖరికి నిరసనగా తన వేలిని నరికేసుకున్న వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వాడు.వీడియోను జాగ్రత్తగా గమనించగా.. ఆ వ్యక్తి మరాఠీలో మాట్లాడుతున్నాడని, కన్నడలో మాట్లాడలేదని మనం భావించవచ్చు.
వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను తీసుకుని.. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించగా ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫాల్తాన్‌లో చోటు చేసుకున్నట్లు మేము కనుగొన్నాము.
ఆగస్టు 19, 2023న ఇండియా టుడే ప్రచురించిన నివేదిక ప్రకారం.. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ధనంజయ్ నానవరే.. అతడి వయసు 43 సంవత్సరాలు. తన అన్న, వదిన ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ప్రతి వారం తన శరీరభాగాన్ని నరికివేసుకుంటానని బెదిరించాడు.
ఈ ఘటన అనంతరం పోలీసులు ధనంజయ్ ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, కొంతమంది వేధింపుల కారణంగా తన సోదరుడు, అతని భార్య ప్రాణాలు తీసుకున్నారని ధనంజయ్ వివరించాడు. డబ్బుల కోసం వేధిస్తున్న వారి పేర్లను కూడా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని తెలిపాడు. రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో దర్యాప్తు సంస్థలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ధనంజయ్ కోరాడు. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్రతి వారం తన శరీరంలోని ఒక భాగాన్ని కోసుకుని.. డిప్యూటీ సీఎంకు పంపుతానని బెదిరించాడు.
తమిళనాడు ఎన్నికల సందర్భంగా కూడా అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనపై నిజ నిర్ధారణ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని స్పష్టం చేశాయి.
వైరల్ అవుతున్న వాదన.. ప్రజలను తప్పుదారి పట్టించేది. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటకకు చెందిన వ్యక్తి తన వేలును నరికివేసుకోలేదు.
Claim : Video shows a person from Karnataka cut off his finger for voting to the Congress during elections
Claimed By : Social media users
Fact Check : Misleading