ఫ్యాక్ట్ చెక్: బీస్ట్ ఆన్‌లైన్ క్యాసినో గేమింగ్ యాప్‌ను BBC హిందీ న్యూస్ యాంకర్ ప్రమోట్ చేయలేదు. ఈ వీడియో AI ద్వారా రూపొందించారు.

జిమ్మీ డొనాల్డ్‌సన్.. Mr బీస్ట్‌గా ప్రసిద్ధి చెందాడు. యూట్యూబ్ లో 232 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు మిస్టర్ బీస్ట్. కొన్ని చిత్ర విచిత్రమైన పనులు చేయడం ద్వారా మిస్టర్ బీస్ట్ కు భారీగా ఫాలోవర్స్, అతడి కంటెంట్ కు వ్యూస్ ఉన్నాయి.

Update: 2024-01-24 07:12 GMT

AI video of BBC presenter

జిమ్మీ డొనాల్డ్‌సన్.. Mr బీస్ట్‌గా ప్రసిద్ధి చెందాడు. యూట్యూబ్ లో 232 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు మిస్టర్ బీస్ట్. కొన్ని చిత్ర విచిత్రమైన పనులు చేయడం ద్వారా మిస్టర్ బీస్ట్ కు భారీగా ఫాలోవర్స్, అతడి కంటెంట్ కు వ్యూస్ ఉన్నాయి. జిమ్మీ డొనాల్డ్‌సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించాడు. గేమింగ్, కామెంటరీ వంటి వాటితో మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్ చేస్తూ వస్తున్నాడు.

BBC హిందీ న్యూస్ ప్రెజెంటర్ సారిక సింగ్‌ కు సంబంధించిన ఒక వీడియో Instagram లో వైరల్ అవుతూ ఉంది. మిస్టర్ బీస్ట్ కు సంబంధించిన గేమింగ్ యాప్ ను ఆ వీడియోలో ప్రమోట్ చేసినట్లు మనం చూడొచ్చు. వీడియోలో మిస్టర్ బీస్ట్ డబ్బుతో కూడిన గదిని చూపించడం కూడా మనం చూడవచ్చు. అది అతను ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిధి అని చెప్పారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు. పలు వీడియోలను మెర్జ్ చేసి సృష్టించారు, న్యూస్ ప్రెజెంటర్‌ను చూపించే విజువల్స్ AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించారని మేము గుర్తించాం.

మిస్టర్ బీస్ట్ ఆన్ లైన్ క్యాసినో గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా పలు రిపోర్టులను గుర్తించాం. బీబీసీ న్యూస్ రీడర్లు, ప్రముఖ వ్యక్తులు ఈ గ్యాంబ్లింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా పలు వీడియోలను క్రియేట్ చేశారు. ఆన్ లైన్ జూదాన్ని ప్రమోట్ చేస్తున్న పలు కంపెనీలు ఇలా ఫేక్ వీడియోలు ప్రమోట్ చేస్తున్నాయి. ప్రజలను మోసగించడానికి ఇలాంటి పలు వీడియోలను సృష్టించడం మొదలుపెట్టారు.

moekordofani అనే ట్విట్టర్ వినియోగదారు ప్రజలను హెచ్చరించారు. Mr బీస్ట్, BBC రిపోర్టర్ డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించి జూదాన్ని ప్రమోట్ చేస్తున్నారని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన నియంత్రణలో లేదని.. మనల్ని మోసం చేసే తప్పుడు ప్రకటనలను చూస్తూనే ఉన్నామని హెచ్చరించారు.

ఈ వీడియో హిందీ వెర్షన్ కూడా ఉంది.
బీబీసీ న్యూస్ ప్రెజెంటర్ సారిక సింగ్ ట్వీట్ ను కూడా మేము గుర్తించాం. ఇలాంటి యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీప్ ఫేక్ లేదా ఏఐ ట్రిక్ తో ఈ యాడ్ ను రూపొందించారని వివరించారు. తన వాయిస్ ను కూడా ఎంతో చాకచక్యంగా ఉపయోగించారని ఆమె తెలిపారు. ఈ యాడ్ ను తాను చేయలేదని కూడా తెలిపారు.
When we extracted the visuals from the video and searched them using Google search, we found that one of the visuals seen in the viral video is from the video published on Mr Beast's YouTube channel in the year 2021 where he is seen giving away money.

మేము వీడియో నుండి తీసుకున్న విజువల్స్‌ను సంగ్రహించి Google సెర్చ్ చేశాం. వాటిని సెర్చ్ చేయగా.. వైరల్ వీడియోలో కనిపించిన విజువల్స్‌లో ఒకటి 2021 సంవత్సరంలో మిస్టర్ బీస్ట్ YouTube ఛానెల్‌లో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము.

Full View

మిస్టర్ బీస్ట్ ఇతర యూట్యూబర్‌లతో చర్చిస్తున్న విజువల్స్ ను మేము కనుగొన్నాము. అక్కడ మిస్టర్ బీస్ట్ తన గురించి, తన వీడియోలు ఇతర పోరాటాల గురించి చర్చిస్తున్నట్లు మేము గుర్తించాం. కానీ అందులో మాట్లాడుకుంది ఆన్‌లైన్ క్యాసినో గేమ్ గురించి కాదు.

Full View

“MrBeast deepfake scams are out of control” అనే టైటిల్ తో డీప్ ఫేక్ వీడియోలతో జరిగే స్కామ్ ల గురించి హెచ్చరించారు. మిస్టర్ బీస్ట్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన పలు వీడియోల గురించి కూడా హెచ్చరించారు. క్యాసినో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని చెబుతూ.. మోసగించే విధంగా డీప్‌ఫేక్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

Full View

బీస్ట్ ఆన్‌లైన్ క్యాసినో గేమింగ్ యాప్‌ను BBC హిందీ న్యూస్ యాంకర్ ప్రమోట్ చేయలేదు. వైరల్ అవుతున్న వీడియో ఏఐ ద్వారా సృష్టించారు.
Claim :  The video shows a BBC Hindi news presenter promoting Mr. Beast’s online casino gaming app
Claimed By :  Instagram User
Fact Check :  False
Tags:    

Similar News