ఫ్యాక్ట్ చెక్: జంతువులు రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న వీడియో పారిస్ అల్లర్లకు సంబంధించినది కాదు
సారాంశం: ప్యారిస్ వీధుల్లో పరిగెడుతున్న జంతువుల వీడియోలు పాతవని, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలతో ఈ వీడియోలకు ఎటువంటి సంబంధం లేదని www.telugupost.com కనుగొంది.
సారాంశం: ప్యారిస్ వీధుల్లో పరిగెడుతున్న జంతువుల వీడియోలు పాతవని, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలతో ఈ వీడియోలకు ఎటువంటి సంబంధం లేదని www.telugupost.com కనుగొంది.
ఫ్రాన్స్ దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పారిస్ నగరంలో అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. అల్లరిమూకలు వెళ్లి బలవంతంగా జూను తెరిచారని.. దీంతో పారిస్ వీధుల్లో జంతువులు బయట తిరుగుతూ ఉన్నాయని నెటిజన్లు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వీడియోలలో.. వీధుల్లో జీబ్రాలు, గుర్రాలు, సింహాలు కార్ల పక్కన కనిపిస్తాయి.
వీడియోలలో.. వీధుల్లో జీబ్రాలు, గుర్రాలు, సింహాలు కార్ల పక్కన కనిపిస్తాయి.
వైరల్ వీడియో కింద "A Zoo in France has been forced open by rioters. Lions, Zebras and other animals were seen on the streets #FranceHasFallen #FranceRiots #ILLEGALimmigrants" అనే క్యాప్షన్ ఉంది. ఫ్రాన్స్ లోని జూను ఆందోళనకారులు తెరవడంతో అందులో నుండి సింహాలు, జీబ్రాలు బయటకు వచ్చాయని తెలిపారు.
ఫ్రెంచ్ పోలీసు అధికారులు 17 ఏళ్ల నహెల్ అనే టీనేజర్ ను చంపిన తర్వాత.. ప్రజలకు, పోలీసులకు మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల సమయంలో ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
వైరల్ వీడియో మీద 'సెయింట్-డెనిస్' అనే పదాన్ని మేము గమనించాము. అది రియూనియన్ అనే ఫ్రెంచ్ ద్వీపానికి రాజధాని నగరమని కనుగొన్నాము. సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేసిన తర్వాత, మేము ఫిబ్రవరి 12, 2020 న వైరల్ వీడియోతో సరిపోలే పాత YouTube వీడియోని కనుగొన్నాము. సింహాలు రాత్రిపూట సెయింట్-డెనిస్‌లో ఎలాంటి భయం లేకుండా తిరుగుతాయంటూ టైటిల్ పెట్టారు,
అదే వీడియో 2020లో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశారు. ఆ ప్రాంతాన్ని సెయింట్-డెనిస్ అని పేర్కొన్నారు. ప్యారిస్‌లో ఇటీవలి నిరసనల సమయంలో సింహాలు వీధుల్లో కనిపించలేదని ఈ పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కొన్ని సంవత్సరాల క్రితం నుండి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వీధుల్లో సింహాలకు సంబంధించిన వీడియో:వైరల్ వీడియో మీద 'సెయింట్-డెనిస్' అనే పదాన్ని మేము గమనించాము. అది రియూనియన్ అనే ఫ్రెంచ్ ద్వీపానికి రాజధాని నగరమని కనుగొన్నాము. సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేసిన తర్వాత, మేము ఫిబ్రవరి 12, 2020 న వైరల్ వీడియోతో సరిపోలే పాత YouTube వీడియోని కనుగొన్నాము. సింహాలు రాత్రిపూట సెయింట్-డెనిస్‌లో ఎలాంటి భయం లేకుండా తిరుగుతాయంటూ టైటిల్ పెట్టారు,
అదే వీడియో 2020లో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశారు. ఆ ప్రాంతాన్ని సెయింట్-డెనిస్ అని పేర్కొన్నారు. ప్యారిస్‌లో ఇటీవలి నిరసనల సమయంలో సింహాలు వీధుల్లో కనిపించలేదని ఈ పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కొన్ని సంవత్సరాల క్రితం నుండి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.
వీధుల్లో జీబ్రా, గుర్రాలకు సంబంధించిన వీడియో:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఏప్రిల్ 2020 లో ఇండియా.కామ్, ఎన్‌డిటివి ద్వారా అదే విజువల్స్‌ను కలిగి ఉన్న నివేదికలను కనుగొన్నాం.
ఆ నివేదికల ప్రకారం, జంతువులు ఓర్మెసన్-సుర్-మార్నేలోని బాడిన్ సర్కస్ నుండి తప్పించుకున్నాయని తెలుస్తోంది. సర్కస్ ఆవరణలో ఉన్న గేటును తెరిచేయడంతో ఈ జంతువులు కాస్తా తప్పించుకోగలిగాయి. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీబ్రా, గుర్రాలు ఓర్మెసన్-సుర్-మార్నే ప్రాంతాన్ని దాటి పారిస్ శివార్లలో ఉన్న ఛాంపిగ్నీ-సుర్-మార్నే పట్టణానికి చేరుకున్నాయి.
ఫ్రెంచ్ వార్తా సంస్థ, Le Parisien కూడా ఇదే నివేదికను పంచుకుంది.
పారిస్ వీధుల్లో జీబ్రాలు, గుర్రాలు ఇటీవల కనిపించలేదని ఈ వీడియోలు పోస్ట్ చేసిన సంవత్సరం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

ఈ నిరసనల సమయంలో ఏవైనా జంతువులు జూ నుండి తప్పించుకున్నాయా అని అడిగిన ట్వీట్‌కు పారిస్ జూలాజికల్ పార్క్ జూలై 3న స్పందించింది. పారిస్ జూలాజికల్ పార్క్‌లోని అన్ని జంతువులు బాగానే ఉన్నాయని, సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.
మేము వీడియోలకు సంబంధించిన సందర్భాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ.. ఈ దృశ్యాలు ఫ్రాన్స్ నిరసనల కంటే కొన్ని సంవత్సరాల ముందు చోటు చేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Videos of animals running loose on the streets of Paris are linked to recent protests in the city
Claimed By : Twitter Users
Fact Check : False