ఫ్యాక్ట్ చెక్: మనాలీకి సంబంధించి వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఎలాంటి నిజం లేదు..!
క్రిస్మస్-న్యూ ఇయర్ సెలవుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో భారీ ట్రాఫిక్ జామ్ అయిందని.. అందుకు సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు.;
క్రిస్మస్-న్యూ ఇయర్ సెలవుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో భారీ ట్రాఫిక్ జామ్ అయిందని.. అందుకు సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.మా బృందం వైరల్ ఫోటోగ్రాఫ్ ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. Facebook కమ్యూనిటీ ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. @I.Love.Kullu.HP అనే పేజీలో జులై 5, 2022న పోస్టు కనిపించింది.
"మనాలి రోడ్స్ ఈ మధ్య కాలంలో.." అనే క్యాప్షన్‌తో ఫోటో షేర్ చేశారు. చిత్రం @theyashhanda వినియోగదారుకు సంబంధించిన Instagram ఖాతాకు క్రెడిట్స్ ఇచ్చారు.
దానిని క్లూగా తీసుకుని, మేము యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌ని తనిఖీ చేసాము. జనవరి 27, 2022న యూజర్ పోస్ట్ చేసిన వైరల్ ఫోటోగ్రాఫ్‌ని మేము కనుగొన్నాము. జనవరి 29, 2022న పోస్ట్ చేసిన ఫోటో ఉంది. అయితే అది వేరొక కోణం నుండి తీసిన ఫోటో.. అంతేకాకుండా లొకేషన్‌ను కూడా మేము కనుగొన్నాము.
తదుపరి పరిశోధనలో, "నెహ్రూ ఖుండ్ (కుండ్), మనాలి, హిమాచల్ ప్రదేశ్"("Nehru Khund (Kund), Manali, Himachal Pradesh.”) అనే శీర్షికతో ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేసిన అదే చిత్రాన్ని మేము గుర్తించాం.
తదుపరి పరిశోధనలో, "నెహ్రూ ఖుండ్ (కుండ్), మనాలి, హిమాచల్ ప్రదేశ్"("Nehru Khund (Kund), Manali, Himachal Pradesh.”) అనే శీర్షికతో ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేసిన అదే చిత్రాన్ని మేము గుర్తించాం.
దానిని అనుసరించి, మేము "Nehru Khund (Kund), Manali"ని చూసేందుకు Google Earth వ్యూను ఉపయోగించాము. 'కుండ్' సమీపంలో ఉన్న భూభాగం మరియు టోపోలాజికల్ లక్షణాలు వైరల్ ఇమేజ్‌లో కనిపించే వాటితో సమానంగా ఉన్నాయని కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదని.. పాతదని మేము గుర్తించాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాత ఫోటోను ఉపయోగిస్తూ ఉన్నారని కనుగొన్నాం.
Claim : Visuals of heavy traffic in Manali, Himachal Pradesh, due to Christmas-New Year holidays.
Claimed By : Social Media Users
Fact Check : Misleading