ఫ్యాక్ట్ చెక్: ప్రతి కాలేజీలో విద్యార్థులకు కండోమ్ ప్యాకెట్ లను నిల్వ ఉంచాలని జనసేన నాయకురాలు కోరలేదు

ఒక మహిళ ప్లకార్డు పట్టుకుని ఉన్న చిత్రం సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో షేర్ అవుతోంది. చిత్రంలో కనిపిస్తున్న మహిళను జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తనగా గుర్తించారు.

Update: 2023-04-17 11:48 GMT
ఒక మహిళ ప్లకార్డు పట్టుకుని ఉన్న చిత్రం సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో షేర్ అవుతోంది. చిత్రంలో కనిపిస్తున్న మహిళను జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తనగా గుర్తించారు.ఆమె పట్టుకున్న ప్లకార్డుపై “ప్రతి కాలేజ్ లో కండోం ప్యాకెట్లు నిల్వ ఉంచాలి #JSP for students”. అని ఉంది “ఇలాంటి పోస్టర్ లు పట్టుకుని తిరగడానికి సిగ్గు ఉండాలి జనసేన వాళ్లకి. బహుశా వాళ్ళ ఎన్నికల గుర్తు ఇదే రావచ్చు అనుకుంటా అందుకే ప్రచారం అనుకుంటా” అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
Full View
ఈ పోస్టు ఫేస్ బుక్ లో కూడా వైరల్ అవుతోంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ప్లకార్డు పట్టుకుని ఉన్న జనసేన నాయకురాలి పాత చిత్రాన్ని మార్ఫింగ్ చేసి, కించపరిచే నినాదంతో షేర్ చేశారు.మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, జనవరి 2022లో పోస్ట్ చేసిన అసలు చిత్రాలను మేము కనుగొన్నాము.ట్విట్టర్ ఖాతా @PnHarini లో జనవరి 2022లో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను తెరిచినప్పుడు షేర్ చేసిన చిత్రాలనే షేర్ చేశారు. కరోనా భయాలు ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడాన్ని జనసేన నిరసించింది. జనసేన నాయకురాలు పట్టుకున్న ప్లకార్డ్‌పై “విద్యార్ధులకు వెంటనే సెలవులు ప్రకటించాలి #JSP విద్యార్థుల కోసం” అనే నినాదం ఉంది.“కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వము స్కూలు ఓపెన్ చేసి చిన్నపిల్లల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటే విద్యార్థులకు వెంటనే సెలవులు ప్రకటించాలని కోరిన
@Keerthana_JSP
గారు వైసిపి కార్యకర్తలు ఆ ఫోటోలు తీసుకువచ్చి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ @APPOLICE100” అంటూ గతంలో పోస్టు చేసిన ఒరిజినల్ ఫోటోలను షేర్ చేశారు.
మరో ట్విట్టర్ హ్యాండిల్ లో JSP నాయకురాలి అసలు చిత్రాన్ని మరో క్యాప్షన్‌తో షేర్ చేశారు: “ఎలాగూ ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు.. పరీక్షల అనంతరం సెలవులు ప్రకటిస్తారు.. దానికి మీ హడావుడి ఏంటో.. @PawanKalyan @JanaSenaParty స్కూల్ పిల్లలను జనసేన స్టిక్కెర్లు అంటించే ప్రోగ్రాం కి తీసుకెళ్లాలని నా ..? @Keerthana_JSP
జనసేన నాయకురాలు కీర్తన 2022లో తాను పోస్ట్ చేసిన పాత వీడియోని క్యాప్షన్‌తో షేర్ చేసింది.. “Jan23, 2022 jspforstudents digital campaign చదువుకొని సస్తే అర్థమవుతుంది. కోవిడ్ టైంలో పాజిటివ్ రేట్ ఎక్కువ ఉందని, పిల్లలకు ఆన్లైన్లో క్లాసెస్ నడపండి అని చేసిన డిజిటల్ క్యాంపెయిన్ ఫోటోలను ఇప్పుడు వైరల్ చేసుకుంటున్నారు సిగ్గులేని పేటియం కార్యకర్తలు.” అంటూ పోస్టులు పెట్టారు.
జనసేన నాయకురాలి పాత చిత్రాన్ని మార్ఫింగ్ చేసి కించపరిచే వ్యాఖ్యలతో షేర్ చేశారు. మహిళా రాజకీయ నాయకురాలి పరువు తీయాలనే ఉద్దేశ్యంతో కొందరు ఈ చిత్రాన్ని రూపొందించారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim :  Janasena leader holds obscene placard
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News