వైరల్ ఇమేజ్ గోవాలో బీజేపీ నేతలు పార్టీలు చేసుకుంటున్నట్లు చూపించట్లేదు, అది పార్టీ పార్లమెంటరీ సమావేశంలో తీసినది

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు గోదావరి నది వరదకు గురయ్యాయి.కొద్దిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది వరద నీటిలో చిక్కుకుపోయారు.

Update: 2022-07-21 04:06 GMT

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు గోదావరి నది వరదకు గురయ్యాయి.కొద్దిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది వరద నీటిలో చిక్కుకుపోయారు.

ఇంతలో, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) యొక్క సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి, ఒక చిత్రాల సమూహాన్ని పంచుకున్నారు. అందులో ఒక చిత్రంలో బిజెపి నాయకుల బృందం సంతోషంగా పోజులివ్వడం చూడొచ్చు. బీజేపీ నాయకులు గోవా లో పార్టీ చేసుకుంటుంటే, టిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణలో వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి కృషి చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు.

#TRS & #BJP మధ్య తేడా చూడండి. ఈ వరద సంక్షోభంలో టీఆర్‌ఎస్ నాయకులు ప్రజలతో మమేకమవుతుండగా, బీజేపీ నేతలు గోవాలో పార్టీలు చేసుకుంటూ తమ స్నేహితులతో ఉల్లాసంగా ఉంటున్నారు! @KTRTRS"

బీజేపీ నేతల ఫోటోలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్, లోక్‌సభ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియా తదితరులు కలిసి కూర్చున్నట్లు కనిపిస్తోంది.

ఇదే ట్వీట్ ని కొందరు ఫేస్బుక్ లో కూడా షేర్ చేసారు.

Full View

నిజ నిర్ధారణ:

వైరల్ చిత్రంలో, డిల్లీ లో జరిగిన పార్టీ పార్లమెంటరీ మీటింగ్‌లో బీజేపీ నేతలు ఉన్నారు తప్ప గోవాలో పార్టీలు జరుపుకోవడం లేదు.. క్లెయిం అబద్దం.

మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రం కోసం శోధించినప్పుడు, అదే చిత్రాన్ని జూలై 16, 2022న కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

'ఈ ఫోటోలో కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్, లోక్‌సభ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లువాలియా తదితరులు కలిసి కూర్చున్నట్లు కనిపిస్తోంది' అని ఆ ట్వీట్‌కు క్యాప్షన్ ఉంది.

ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా ప్రముఖ బీజేపీ నేతలంతా హాజరయ్యారు.

ఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఈవ్సమావేశానికి పలువురు బీజేపీ నేతలు హాజరై తమ చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేశారు.


ఇలా షేర్ చేసిన చిత్రాలను గమనించినప్పుడు, వాటిలోని ప్రాంగణం వైరల్ చిత్రం లో ఉన్న విధంగా ఉందని, బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం న్యూ ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లోని బాలయోగి ఆడిటోరియంలో జరిగినట్టు తెలుస్తోంది.

బీజేపీ స్థానిక నాయకులు బండి సంజయ్ తదితరులు వరదల కారణంగా దెబ్బతిన్న తెలంగాణలోని స్థానిక ప్రాంతాలను సందర్శించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు.

Full View

Full View

అందువల్ల, వైరల్ చిత్రం బిజెపి నాయకులను పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చూపుతోంది, గోవాలో పార్టీలు జరుపుకుంటూ కాదు. ఈ క్లెయిం అబద్దం.

Claim :  Viral image show BJP leaders partying in Goa
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News