ఫ్యాక్ట్ చెక్: ఐఫోన్ పేలుడుకు, లెబనాన్‌లోని పేలుళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ విజువల్స్ పాతవి

హిజ్బుల్లా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ దేశంలో వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలడం ప్రారంభించాయి.;

Update: 2024-09-20 05:20 GMT
iPhone explosion in Lebanon,  explosion of iPhone,  explosion of iPhone is not related to blasts in Lebanon, facts on explosion of iPhone, Viral image showing explosion of iPhone, blasts in Lebanon

iPhone explosion

  • whatsapp icon

హిజ్బుల్లా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ దేశంలో వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో లెబనాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. హిజ్బుల్లా మిలిటరీ గ్రూపుకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో 12 మంది మరణించారు. ఈ పేలుళ్లు జరిగిన ఒక రోజు తర్వాత వాకీ టాకీలు పేలడంతో 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. తైవాన్, హంగేరీకి చెందిన రెండు సంస్థలు పేజర్‌లను తయారు చేశాయని మీడియా నివేదికలు వచ్చాయి. లెబనాన్‌లో పేలిన వాకీ టాకీలను ఉత్పత్తి చేసిన జపాన్ కంపెనీ 10 సంవత్సరాల క్రితం ఆ మోడల్‌ను తయారు చేయడం మానేసింది. అయితే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కొత్త తరహా యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇంతలో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు లెబనాన్‌లో ఐఫోన్ పేలిపోయిందనే వాదనతో ఐఫోన్‌ పేలినట్లుగా చూపించే చిత్రం వైరల్‌గా మారింది. కొంతమంది వినియోగదారులు “లెబనాన్‌లో ఐఫోన్‌లు పేలుతున్నాయి” అనే శీర్షికతో చిత్రాన్ని షేర్ చేయగా, మరికొందరు “లెబనాన్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతోంది. పెద్ద ఎత్తున కమ్యూనికేషన్ పరికరాలు, బ్యాటరీలు, మోటారు, స్కూటర్ బ్యాటరీలు వంటివి పేలే అవకాశం ఉంది" అనే క్యాప్షన్‌లతో ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా లిథియం బ్యాటరీలు పేలే అవకాశం ఉందని కూడా తెలిపారు. బ్యాటరీల పరిమాణం పెద్దగా ఉండడంతో ఇళ్లు, వాహనాల్లో మంటలు చెలరేగడంతో తీవ్ర నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పోస్టుల్లో వివరించారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ చిత్రం లెబనాన్‌లో పేలిన ఐఫోన్‌ కు సంబంధించింది కాదు.
వైరల్ అవుతున్న ఫోటోను మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ చిత్రం 2021 నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనుగొన్నాము.
“This is an old photo of an iPhone 12 Pro Max from March of 2021. The owner was charging the iPhone when the phone suddenly exploded, and the table and bed pillow caught fire. This was in Egypt and is unrelated to the Israelis. 
ఒరిజినల్ 
రిపోర్ట్,  ఒరిజినల్ ఇమేజ్, అంటూ లింకులను షేర్ చేసిన ఒక ఎక్స్ పోస్టును మేము గుర్తించాం. ఈ ఫోటో 2021లో జరిగిన ఘటనకు సంబంధించిందని ఆ పోస్టులో తెలిపారు. మార్చి 2021 న iPhone 12 Pro Max పేలినప్పటి పాత ఫోటో. యజమాని ఐఫోన్‌కు ఛార్జ్ చేస్తున్నప్పుడు, ఫోన్ అకస్మాత్తుగా పేలింది. టేబుల్, దిండుకు మంటలు చెలరేగాయి. ఇది ఈజిప్టులో జరిగింది. లెబనాన్‌కు ఎలాంటి సంబంధం లేదు.
Cairo24.com అనే వెబ్‌సైట్‌లో అరబిక్ భాషలో ప్రచురించబడిన ఒక నివేదికను కూడా మేము కనుగొన్నాము. ఛార్జ్ చేస్తున్నప్పుడు ఐఫోన్ పేలడంతో చెలరేగిన మంటల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు హమ్జా అనే చిన్నారి చేయికి గాయాలు అయ్యాయి. "అహ్మద్ ఒకాషా" అనే వ్యాపారవేత్త ఐఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రికల్ సాకెట్‌లో పెట్టాడు. ఒక్కసారిగా ఫోన్ పేలింది. మంటలు నిద్రిస్తున్న పిల్లవాడి దగ్గరకు చేరుకున్నాయి. పిల్లవాడు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో నేలపై పడడంతో చేయి విరిగిపోయింది. తండ్రి వచ్చి మంటలను ఆర్పడంతో చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
nabd.com అనే మరో అరబిక్ వెబ్‌సైట్ కూడా కైరోలోని మాడిలో ఐఫోన్ పేలుడు కారణంగా ఒక చిన్నారి గాయపడినట్లు కథనాన్ని ప్రచురించింది. వైరల్ చిత్రాలు లెబనాన్‌లో ఐఫోన్ పేలుడుకు సంబంధించింది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఇటీవల లెబనాన్‌లో ఐఫోన్ పేలిన దృశ్యాన్ని వైరల్ విజువల్స్ చూపుతున్నాయి
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News