ఫ్యాక్ట్ చెక్: తప్పుడు వాదనతో వైరల్ అవుతున్న పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తుల చిత్రం
కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటన దేశ ప్రజలను షాక్ కు గురి చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. 31 ఏళ్ల ట్రైనీని 36 గంటల షిఫ్ట్ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశారు. బాధ్యులకు న్యాయం చేయాలని, శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనేక మంది వీధుల్లోకి వచ్చారు. ఆమె ఆగస్ట్ 9, 2024న RG కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కూడా
కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటన దేశ ప్రజలను షాక్ కు గురి చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. 31 ఏళ్ల ట్రైనీని 36 గంటల షిఫ్ట్ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశారు. బాధ్యులకు న్యాయం చేయాలని, శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనేక మంది వీధుల్లోకి వచ్చారు. ఆమె ఆగస్ట్ 9, 2024న RG కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కూడా. షిఫ్ట్, స్టడీ అవర్స్ 36 గంటల పాటు సాగిన తర్వాత, ఆమె కాలేజ్ సెమినార్ రూమ్‌లో నిద్రపోయింది. అక్కడ ఆమె లైంగిక వేధింపులకు గురైంది. ఆ తర్వాత హత్య చేశారు. ఇతర ఇంటర్న్‌లు, విద్యార్థులు మరుసటి రోజు సెమినార్ గదిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు. భారతదేశంలో మహిళలకు భద్రత లేకపోవడంపై నిరసనగా కోల్‌కత్తా, ఇతర నగరాల్లో వేలాది మంది మహిళలు అర్థరాత్రి గుమిగూడారు.
ఛతీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాఖీ వేడుకల తర్వాత ఇద్దరు మహిళలు తిరిగి వస్తున్నప్పుడు 10 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బీజేపీ పార్టీ లోగోతో పాటు, హిందీలో టెక్స్ట్‌తో పాటు కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన చిత్రం Xలో వైరల్ అవుతూ ఉంది. రేపిస్టులలో ఒకరు బీజేపీ నాయకులు పూనమ్ ఠాకూర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
బీజేపీ పార్టీ ఈ వ్యక్తులపై ఇప్పుడు బుల్డోజర్లను పంపుతుందా అని ప్రశ్నిస్తూ.. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికార బీజేపీ పార్టీ ఈ దోషులను శిక్షిస్తుందా? అని ప్రశ్నిస్తూ ఉన్నారు. “क्या बनारस क्या रायपुर। बहन बेटियां सुरक्षित नहीं। जेपी नड्डा जी की तत्काल इस्तीफा दे देना चाहिए।“ అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ సంఘటన సెప్టెంబర్ 2023లో జరిగింది.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. న్యూస్ వెబ్‌సైట్‌లలో ప్రచురించిన కొన్ని వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
ABP లైవ్ ప్రకారం, ఈ సంఘటన ఆగస్టు 31, 2023 రాత్రి జరిగింది, మహిళలు రాఖీ వేడుకల నుండి తిరిగి వస్తుండగా, కొంతమంది అబ్బాయిలు వారిని కొట్టి, ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. రాయ్‌పూర్ పోలీసులు అదే రోజు రాత్రి 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రధాన నిందితుడు పూనమ్ ఠాకూర్ అని గుర్తించారు. అతను రౌడీ షీటర్, అతనిపై ఆరంగ్, మందిర్ హసౌద్ పోలీస్ స్టేషన్‌లలో ఐదు కేసులు ఉన్నాయి. 2019లో జైలు శిక్ష అనుభవించారు. అత్యాచారం ఆరోపణలపై 2022లో మళ్లీ అరెస్టు అయ్యాడు. ఆగస్టు 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. అరెస్ట్ అయిన వ్యక్తులలో ఘనశ్యామ్ నిషాద్, లవ్ తివారీ, నయన్ సాహు, కేవల్ వర్మ, దేవచరణ్ ధివర్, లక్ష్మీ ధ్రువ్, ప్రహ్లాద్ సాహు, కృష్ణ సాహు, యుగల్ కిషోర్ తదితరులు ఉన్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి.. ప్రధానంగా రాష్ట్ర రాజధానిలో హత్యలు, అత్యాచారం, కత్తిపోట్లు వంటి సంఘటనలు తరచుగా నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తోందని కథనం పేర్కొంది.
ఔట్‌లుక్ కథనం ప్రకారం, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి మొత్తం పది మంది నిందితులను పట్టుకున్నారు. నిందితులలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారు. ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్ ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్‌పై విడుదలయ్యారు. పూనమ్ ఠాకూర్ స్థానిక BJP నాయకుడు లక్ష్మీ నారాయణ్ సింగ్ కుమారుడు. రాష్ట్ర రాజధానిలోని రిమ్స్ మెడికల్ కాలేజీ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
అందుకే, ఈ చిత్రం ఇటీవలి సంఘటన కాదు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 2023లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది.
Claim : బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల రాఖీ రోజున ఇద్దరు మహిళలపై 10 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
Claimed By : Twitter users
Fact Check : Misleading