ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా అమెరికాలో ఎటువంటి పోస్టర్లను ఏర్పాటు చేయలేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లారు. భారత్-అమెరికా బంధాలను ఆయన మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఆయన పలు విషయాలను చర్చించారు.

Update: 2023-06-27 04:37 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లారు. భారత్-అమెరికా బంధాలను ఆయన మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఆయన పలు విషయాలను చర్చించారు. వైట్ హౌస్‌లో బిడెన్ కుటుంబం నిర్వహించిన స్టేట్ డిన్నర్‌లో కూడా పాల్గొన్నారు.

మోదీ పర్యటనకు ముందు అమెరికాలో పలు ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లను ఏర్పాటు చేసారంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. "antimodi", "#ModiNotWelcome" బ్యానర్‌లను ఏర్పాటు చేసారంటూ అనేక పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంకో ఫోటో:

ఫ్యాక్ట్ చెకింగ్:


మొదటి ఫోటోకు అమెరికాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫోటో హైదరాబాద్ లోనిది.

చిత్రం 1: ఈ పోస్టర్ ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్ నుండి ప్రేరణ పొందింది.ఆ పోస్టర్ మీద “Mr. N Modi, we only rob banks, you rob the whole nation.” అని ఉంది. ఆ వెబ్ సిరీస్ లోని క్యారెక్టర్లు కేవలం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దోచుకుంటున్నారు అనే అర్థంతో ఆ చిత్రాలను ఏర్పాటు చేశారు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాక.. ఇది హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ అని మేము గుర్తించాం. ఈ మనీ హీస్ట్ పోస్టర్ లాంచ్‌కు సంబంధించిన ఈవెంట్‌ని కూడా మేము కనుగొన్నాము. జులై 2022న తెలంగాణ టుడే, టెలిగ్రాఫ్ ఇండియా నివేదికల ద్వారా ఈ పోస్టర్లను హైదరాబాద్‌లో పెట్టారని చూపించారు. మనీ హీస్ట్ హోర్డింగ్‌లు పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దోచుకుంటున్న దొంగ అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు, ఎల్‌బి నగర్ సర్కిల్‌లో ఈ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.

టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఈ హోర్డింగ్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అద్భుతమైన క్రియేటివిటీ అంటూ మెచ్చుకున్నారు.

మేము హైదరాబాద్‌లో ఈ పోస్టర్ కు సంబంధించిన జియో లొకేషన్‌ను కూడా ధృవీకరించాము. హైదరాబాద్ శివారులోని సరూర్‌నగర్ దగ్గర ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో ఏర్పాటు చేశారు.

చిత్రం 2:
చిత్రంలో వ్యక్తులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లోగోతో బ్యానర్‌లను పట్టుకుని ఉన్న ప్లకార్డులతో Mr Modi,” “We don’t let you forget,” and “Gujarat 2002” అని ఉంది.

మే 2, 2022న పోస్ట్ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము, అదే ఫోటోగ్రాఫ్‌తో “బెర్లిన్‌లో ప్రధాని మోదీ” అనే శీర్షిక ఉంది. 2022 మేలో ప్రధాని మోదీ బెర్లిన్‌కు వెళ్లి జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను కలిశారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోగా మేము గుర్తించాం.

ప్రధాని నరేంద్ర మోదీ మే 2022లో బెర్లిన్ ను సందర్శించి జర్మనీ ఛాన్సలర్‌ను కలిశారు. ట్వీట్‌లో బ్యాగ్రౌండ్ లో “స్టార్‌బక్స్ కాఫీ” భవనాన్ని గుర్తించగలిగాము. జియో-లొకేషన్‌ని ధృవీకరించిన తర్వాత, వైరల్ ఇమేజ్‌లో ఉన్నది బెర్లిన్‌ నగరమని గుర్తించాం. బెర్లిన్ నగరం లోని స్టార్ బక్స్ కాఫీ అవుట్‌లెట్‌ అని మేము నిర్ధారించగలిగాము.

గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫోటోలను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు లింక్ చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim :  “Anti-Modi” banners put up in the United States ahead of Modi's visit.
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News