ఫ్యాక్ట్ చెక్: బ్లూ డ్రాగన్ నది (ఒడెలైట్)కి సంబంధించిన వైరల్ చిత్రం ఏరియల్ ఇమేజ్.. అంతేకానీ అంతరిక్షం నుండి చిత్రీకరించలేదు

డ్రాగన్‌ను పోలి ఉండే పోర్చుగల్‌లోని నది చిత్రం అంతరిక్షం నుంచి తీశారనే వాదనతో ప్రచారంలో ఉంది.

Update: 2023-08-19 06:05 GMT

డ్రాగన్‌ను పోలి ఉండే పోర్చుగల్‌లోని నది చిత్రం అంతరిక్షం నుంచి తీశారనే వాదనతో ప్రచారంలో ఉంది.




Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. చిత్రం నిజంగా డ్రాగన్ ఆకారంలో ఉన్న రిజర్వాయర్‌ను చూపినప్పటికీ, అది అంతరిక్షం నుండి చిత్రీకరించలేదు. చిత్రం పోర్చుగల్‌లోని బ్లూ డ్రాగన్ నదికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటో

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించగా.. టైటానిక్ వేల్ అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా “ది బ్లూ డ్రాగన్ రివర్, పోర్చుగల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వైరల్ ఇమేజ్ మాకు కనిపించింది. వే ఆఫ్ ది డ్రాగన్ - పోర్చుగల్‌లోని ఫారోకు ఉత్తరాన, క్యాస్ట్రో మారిమ్‌కు సమీపంలో ఉన్న నది. ఈ నది.. బ్లూ డ్రాగన్ నదిగా ప్రసిద్ధి చెందింది, 2010లో స్టీవ్ రిచర్డ్స్ (వేల్స్) తీసిన ఫోటో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాని ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ నది నిజంగానే ఉందని తేలింది. ఆ నది ఆకారం, నీలం రంగులో ఉన్న కారణంగా బ్లూ డ్రాగన్ అనే పేరు వచ్చింది." అని తెలిపారు.
Full View

Viralarticles.co.ukలోని ఒక కథనం ప్రకారం, ఫోటోగ్రాఫర్‌లు, ప్రకృతి ఔత్సాహికులకు ఈ బ్లూ డ్రాగన్ నది నిజంగా ఓ స్వర్గం లాంటిది. అక్కడి నీరు, సూర్యుడి నుండి వచ్చే వెలుగు, పచ్చదనం వంటి ఎంతో అద్భుతంగా మనిషి కళ్ళకు, కెమెరా లెన్స్ కు అద్భుతంగా కనిపిస్తాయి. నది దూరం నుండి చూసినప్పుడు నీలం రంగులో అద్భుతంగా కనిపిస్తుంది. కెమెరాలో ప్రతి స్నాప్‌ ఎంతో కళాత్మకంగా మారుతుంది.

వైరల్ కథనంలో ఏరియల్ వ్యూలో అనేక చిత్రాలను, వైరల్ చిత్రాన్ని పోలి ఉండే Google మ్యాప్స్ కు సంబంధించిన చిత్రాలను కూడా భాగస్వామ్యం చేశారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫోటోగ్రాఫర్ స్టీవ్ రిచర్డ్స్ డ్యామ్ పై నుండి విమానంలో వెళుతున్న సమయంలో తన కెమెరాలో నదిని బంధించాడు. ఆ సమయంలో నది వంకరగా, నీలం రంగులో కనిపించింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నది రూపురేఖలు చైనీస్ డ్రాగన్ లాగా ఉన్నాయి.

ది బ్లూ డ్రాగన్ అనే శీర్షికతో Flickrలో ఫోటోగ్రాఫర్ స్టీవ్ రిచర్డ్స్ పోస్ట్ చూడొచ్చు.

“ఈ ఫోటోను పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది చాలా ఫేమస్ అవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఈ ఫోటోను చాలా 'బ్లాగ్' సైట్‌లలో చూశాను. కొందరు ఇది నిజమా.. కాదా.. అని వ్యాఖ్యలు చేశారు. ఇది కంప్యూటర్‌లో రూపొందించిన చిత్రం అని మరికొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు ఉపగ్రహ చిత్రం అని కూడా వ్యాఖ్యలు చేయడం చదివాను కూడా!" అని అన్నారు. నేను కార్డిఫ్ నుండి ఫారోకి మా విమానంలో వెళుతున్నప్పుడు తీసిన నిజమైన ఫోటో. ఆ నది అసలైనది. నదిలోని నీరు.. నీలి రంగు ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంటుందని తెలిపారు.

పై సమాచారం అది నకిలీ కాదని నిర్ధారించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన డిబేట్ చాలా బాగుంది. నా చిత్రం చాలా వరకు సంచలనం సృష్టించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను! దీన్ని వీక్షించడానికి సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు, మీకు నచ్చిన కామెంట్లు చేయండి. నా ఇతర చిత్రాలు కూడా ఈ చిత్రం తరహాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుందని నేను ఆశిస్తున్నాను !!

అందరికీ చీర్స్!! స్టీవ్(వేల్స్ యూకే)
Google మ్యాప్స్‌లో చిత్రం ఇక్కడ ఉంది.


 


అందువల్ల, ఈ వైరల్ చిత్రం అంతరిక్షం నుండి చిత్రీకరించలేదు. కానీ పోర్చుగల్‌లోని బ్లూ డ్రాగన్ నది (రివర్ ఒడెలైట్) ఏరియల్ వ్యూ చిత్రం. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  The image of the Blue Dragon river in Portugal is taken from space
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News