ఫ్యాక్ట్ చెక్: 2024లో దుబాయ్ వరదల్లో ఒంటెలు కొట్టుకుపోతున్నట్లు చూపుతున్న వైరల్ వీడియో తప్పుదారి పట్టిస్తోంది.
దుబాయ్‌లో వరదలు ముంచెత్తిన కొద్ది రోజులకే మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థులు, కార్మికులు ఇంట్లో ఉండాలని అధికారులు కోరారు. పలు విమానాలను కూడా రద్దు చేశారు. ఇంట్లోనే ఉండమని కోరుతూ మొబైల్ ఫోన్‌లలో పౌరులకు అత్యవసర నోటిఫికేషన్‌లు కూడా దుబాయ్ అధికారులు పంపారు
దుబాయ్‌లో వరదలు ముంచెత్తిన కొద్ది రోజులకే మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థులు, కార్మికులు ఇంట్లో ఉండాలని అధికారులు కోరారు. పలు విమానాలను కూడా రద్దు చేశారు. ఇంట్లోనే ఉండమని కోరుతూ మొబైల్ ఫోన్‌లలో పౌరులకు అత్యవసర నోటిఫికేషన్‌లు కూడా దుబాయ్ అధికారులు పంపారు. దుబాయ్‌లో 12 గంటల్లో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో నగరం పొందే వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువ. ఇక అబుదాబిలో 24 గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఏప్రిల్, మేలో కురిసే వర్షం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అస్థిర వాతావరణం యూఏఈలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎడారి ప్రాంతంలో వరదలు రావడంతో ఒంటెలు నీటిలో కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. దుబాయ్‌లోని ఎడారి ప్రాంతంలో వరదలు వచ్చాయని.. ఫేస్‌బుక్‌లోని వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు. ఇంతకుముందు నగర ప్రాంతం మునిగిపోయిందని, ఇప్పుడు ఎడారి ప్రాంతం మునిగిపోతుందని వినియోగదారులు చెబుతున్నారు.
“2 sides of Dubai flood – yesterday city and desert” అనే క్యాప్షన్ తో వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు పోస్టు చేస్తున్నారు. వరదలు కేవలం నగరంలో మాత్రమే కాదు.. ఎడారిలో కూడా వరదలు వచ్చాయని ఈ వీడియో చూపుతోంది. ఈ వరదల్లో పలు జంతువులు కొట్టుకుపోయాయంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో దుబాయ్ ఎడారిలో వరదలను చూపించలేదు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేశాం. ఈ వీడియోను 2018 సంవత్సరంలో కొంతమంది Facebook వినియోగదారులు పోస్టు పెట్టారు. అరబిక్ భాషలో పలువురు పోస్టులు పెట్టినట్లు గుర్తించాం.
‘తబుక్‌లోని నదిలో కొట్టుకుపోతున్న ఒంటెలు-వీడియో’ అనే టైటిల్‌తో మలయాళ వారపత్రిక కూడా ఈ వీడియోను షేర్ చేసింది. ఈ కథనం అక్టోబర్ 26, 2018న ప్రచురించారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒంటెలు ఎడారిలో కొట్టుకుపోయాయని కథనంలో తెలిపారు. ఊహించని విధంగా ఒంటెలు నిల్చున్న ప్రదేశంలో వరద నీరు ప్రవహించడంతో ఒంటె ఒకటి కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ada Monzon అనే ఇంస్టాగ్రామ్ యూజర్ వీడియోను షేర్ చేశారు. “Lluvias fuertes en Tabouk, Arabia Saudita han ocasionado una crecida significativa de este río. Los camellos enfrentaron grandes retos. Via @dearmoonproject @wmo_omm y @climatewithoutborders without Borders” అనే క్యాప్షన్ తో అక్టోబర్ 27, 2018న పోస్టు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని బయో ప్రకారం, ఆమె వార్తలను అందించే బాధ్యతలను మోస్తున్నారు. వాతావరణానికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందించడం ఆమె వృత్తి అని కూడా తెలుస్తోంది.
అందుకే.. వరదల్లో కొట్టుకుపోయిన ఒంటెలను చూపించే వీడియో దుబాయ్‌కి చెందినది కాదు. మరీ ముఖ్యంగా ఇటీవలిది కాదు. వీడియో సౌదీ అరేబియాలోని టబుక్ ప్రాంతానికి సంబంధించినది. ఈ సంఘటన అక్టోబర్, 2018లో చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : 2024లో వచ్చిన వరదల కారణంగా దుబాయ్ ఎడారిలో ఒంటెలు కొట్టుకుని పోతున్నాయని వైరల్ వీడియో చూపుతోంది
Claimed By : Facebook Users
Fact Check : False