ఫ్యాక్ట్ చెక్: హమాస్ మిలిటెంట్లు పారాచూట్ల ద్వారా ఇజ్రాయెల్ లోకి దిగుతున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు

వైరల్ వీడియో ఇజ్రాయెల్ కు సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తుంది

Update: 2023-10-13 04:18 GMT

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం జరుగుతూ ఉండగా.. ఒక భవనంపై అనేక పారాచూట్‌లు ల్యాండ్ అవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హమాస్ తీవ్రవాదులు.. పారాచూట్ల సాయంతో ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు.

"పాలస్తీనా స్వాతంత్ర్య సమరయోధులు ఇజ్రాయెల్ భూభాగంలోకి పారాచూట్‌ను చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్నారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ వీడియో కింద పలువురు ఈ ఘటన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది కాదని స్పష్టం చేశారు.

ఈ వీడియో ఈజిప్టు దేశంలో చోటు చేసుకుంది. మిలటరీ ట్రైనింగ్ లో భాగంగా తీసిన వీడియో ఇది. ఈజిప్టియన్ మిలిటరీ అకాడెమీకి చెందినదని చెప్పారు.

మేము Google లెన్స్ ద్వారా, భవనం ప్రవేశద్వారం మీద రాసిన పదాలను అనువదించాము. అందులో "మిలిటరీ కాలేజీ" అని రాసి ఉంది.


 గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి నిశితంగా పరిశీలించాం. ఈజిప్ట్‌లోని మిలిటరీ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన వీడియో అని మేము గుర్తించాం. వైరల్ వీడియోలో చూసిన దానితో సరిపోలుతుందని మేము గమనించాము.



 మేము వీడియో సందర్భాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ.. వైరల్ వీడియో ఇజ్రాయెల్ కు సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తుంది. హమాస్ మిలిటెంట్లు పారాచూట్‌లు ధరించి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఈజిప్టు కు సంబంధించిన వీడియో తప్పుగా షేర్ చేస్తున్నారు.


Claim :  Hamas militants entering Israel in parachutes
Claimed By :  Twitter
Fact Check :  False
Tags:    

Similar News