ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది భారత రాజ్యాంగానికి సంబంధించిన అసలు కాపీ కానే కాదు

భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2025న జరుపుకుంది. భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం ఈ తేదీ;

Update: 2025-01-28 14:20 GMT
Indian Constitution

Indian Constitution

  • whatsapp icon

భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2025న జరుపుకుంది. భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం ఈ తేదీనే అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని రచించి ఆమోదం పొందిన తరువాత అవసరాన్ని బట్టి దాన్ని సవరణ చేస్తుంటారు. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం. వాస్తవానికి ఇది 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్‌లు, 145,000 పదాలను కలిగి ఉంది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పని చేసిందని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.

భారతదేశ అసలైన రాజ్యాంగం హిందీ, ఇంగ్లీషు రెండింటిలోనూ చేతితో రాశారు. ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా రాజ్యాంగాన్ని ఇటాలిక్ శైలిలో రాశారు. పేజీలలో ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్, అతని బృందం భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలను ఉంచారు. భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాకుండా కళాకృతిగా కూడా ఉంటుంది.

అయితే, లండన్ లైబ్రరీలో ఉన్నానని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి భారత రాజ్యాంగం కాపీని చూపిస్తూ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో షేర్ అవుతోంది. అక్కడ ఉన్న ఒక పుస్తకం చూపిస్తూ భారతదేశం సిద్ధాంతపరమైన రాజ్యాంగమని, అందులో హిందూ దేవుళ్ళ చిత్రాలేవీ లేవని తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, కృష్ణుడు వంటి వారి చిత్రాలు లేవనీ వాదించారు.

“बेहद अहम जानकारी बहुत बहुत साधुवाद! आपने ये वीडियो शेयर किया मेरी तरह अधिकतर बहुजन लोग इस दुष्प्रचार से भ्रमित थे। आज सच्चाई सामने आ ही गई।“ అంటూ హిందీలో ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది. “చాలా ముఖ్యమైన సమాచారం పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు! మీరు ఈ వీడియోను షేర్ చేసారు. నాలాగే బహుజనులు చాలా మంది ఈ ప్రచారంతో గందరగోళానికి గురయ్యారు. ఈరోజు నిజం బయటపడింది.'' అన్నది ఆ పోస్టుల అర్థం.

ఇదే వీడియో ని మరో సోషల్ మీడియా వినియోగదారుడు "मनुवादियों का यह दावा भी झूठा निकला. लो आज एक नई जानकारी सामने आई है कि मूल संविधान में किसी भी राम, कृष्ण, सीता की फोटो नहीं है ये लोग आज तक हमारे समाज को मूर्ख बना रहे थे। ये जानकारी वायरल होनी चाहिए जो आपके हाथ में है। అంటూషేర్ చేసారు“ఈ మనువాదుల వాదన కూడా అబద్ధమని తేలింది. చూడండి, అసలు రాజ్యాంగంలో రాముడు, కృష్ణుడు, సీత ఫోటోలు లేవని ఈ రోజు ఒక కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎంతో మంది మన సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. మీ చేతిలో ఉన్న ఈ సమాచారం వైరల్ అవుతుంది." అన్నది వైరల్ పోస్టుల అర్థం

Full View
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు .

ఫ్యాక్ట్ చెక్

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉందో అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించగా.. అసలు కాపీ న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో భద్రపరిచారని మేము కనుగొన్నాము, అసలు కాపీలు ప్రత్యేక హీలియం నిండిన కేసులలో ఉంచారు.
CIR-NIScPR ప్రచురించిన వీడియో ప్రకారం, "ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా" అసలైన హిందీ & ఇంగ్లీషు వెర్షన్‌లు న్యూ ఢిల్లీలోని భారత పార్లమెంటు లైబ్రరీలో ఉంచారు. అవి సహజమైన స్థితిలో అలాగే భద్రపరచారు. చేతిరాతతో చేసిన పార్చ్‌మెంట్ పేపర్‌పై కాలిగ్రాఫ్ చేశారు. 80వ దశకంలో, USAలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ & జెట్టి కన్జర్వేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణుల ఆక్సీకరణం వల్ల అసలైన రాజ్యాంగానికి నష్టం కలుగుతుందని భావించి, అసలైన "భారత రాజ్యాంగాన్ని" రక్షించడానికి 'హెర్మెటిక్‌గా సీల్డ్ గ్లాస్ కేస్' లో ఉంచారు. మార్చి 1994లో, పార్లమెంటరీ లైబ్రరీలో రెండు హెర్మెటిక్లీ సీల్డ్ డిస్‌ప్లే కేసులు ఏర్పాటు చేశారు. అందులో భారత రాజ్యాంగం అసలైన చేతివ్రాత పత్రాలు సురక్షితంగా ఉంచారు. నేటికీ భారత రాజ్యాంగం భద్రతను CSIR-NPL శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తూ ఉంటుంది.

Full View
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన భారత రాజ్యాంగం కాపీని కూడా మేము కనుగొన్నాము. భారత రాజ్యాంగంలోని పేజీలలో రాముడు, సీత, లక్ష్మణుడు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉన్నాయని మేము ధృవీకరించాము.
కాలిగ్రాఫర్ ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజాదా చేతితో భారత రాజ్యాంగం రూపొందించారు. రాజ్యాంగంలో భారతదేశ సాంస్కృతిక/కళాత్మక వారసత్వం తెలిసేలా కళాకృతులు ఉండడం కోసం ప్రముఖ కళాకారుడు నందలాల్ బోస్‌కు అప్పట్లో బాధ్యతలు అప్పగించారు.
రాజ్యాంగం హిందీ, ఆంగ్ల భాషల్లో రెండూ చేతితో రాసినవే అని ABP న్యూస్ ప్రచురించిన ఒక కథనం పేర్కొంది. ప్రపంచంలోనే చేతిరాతతో రాసిన అత్యంత పొడవైన రాజ్యాంగం. దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాశారు. రాజ్యాంగాన్ని శాంతినికేతన్ కళాకారులచే అలంకరించారు.
కనుక, భారత రాజ్యాంగం అసలు కాపీలో హిందూ దేవుళ్ల చిత్రాలు లేవనే వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశం గొప్ప సంస్కృతిని ప్రతిబింబించేలా నందలాల్ బోస్, అతని బృందం భారత రాజ్యాంగాన్ని అందంగా అలంకరించారు.
Claim :  భారత రాజ్యాంగం అసలైన కాపీలో హిందూ దేవుళ్ల చిత్రాలు అసలు లేవు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News