ఫ్యాక్ట్ చెక్: చైనాలోని రెస్టారెంట్ లో నమాజ్ చేస్తున్న వ్యక్తిని చితకబాదారనే వాదన నిజం కాదు

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు నాస్తికులుగా బతకాలి. కానీ ఆ పార్టీ దేశంలో ఐదు మతాలకు గుర్తింపును ఇచ్చింది. బౌద్ధమతం, కాథలిక్కులు, దావోయిజం, ఇస్లాం, ప్రొటెస్టంటిజం విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ

Update: 2024-09-08 08:03 GMT

Namaz

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు నాస్తికులుగా ఉంటారు, అయితే ఆ పార్టీ దేశంలో ఐదు మతాలకు గుర్తింపును ఇస్తుంది. బౌద్ధమతం, కాథలిక్కులు, దావోయిజం, ఇస్లాం, ప్రొటెస్టంటిజం విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుందినమోదిత, నమోదుకాని మత సమూహాలను అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. చైనా ప్రభుత్వం ఉయ్ఘర్ ముస్లింలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఉయ్ఘర్ ముస్లింలను శిబిరాల్లో నిర్బంధించారని, వేలాది మందిని జైళ్లకు పంపారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తిని అతి దారుణంగా కొడుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఓ వ్యక్తి మోకాళ్ల మీద కూర్చుని ఉంటే, అతడిని అత్యంత కిరాతకంగా కొట్టడం ఆ వీడియోలో చూడొచ్చు. మోకాళ్లపై కూర్చున్న వ్యక్తిని మరొక వ్యక్తి దారుణంగా కొట్టిన వీడియో అది. ఇందులో  బాధితుడిని తన్నడం చూడవచ్చు. ఈ వీడియో చైనాకు చెందినదని, ఓ వ్యక్తి రెస్టారెంట్‌లో ప్రార్థనలు చేయడంతో అది నచ్చక.. అతడిని కొట్టారని అంటున్నారు.
బాధితుడు పాకిస్థానీ అని రెస్టారెంట్‌లో నమాజ్ చేస్తున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు కొట్టారని కూడా అంటున్నారు. అంతేకాకుండా బాధితుడిని కొట్టిన వ్యక్తి రెస్టారెంట్ యజమాని అని చెబుతూ పోస్టుల్లో అంటున్నారు. క్యాప్షన్ లో “చైనాలోని ఒక పాకిస్థానీ రెస్టారెంట్‌లో నమాజ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా రెస్టారెంట్ యజమాని వెనుక నుండి వచ్చి దాడికి తెగబడ్డాడు. ఎవరైనా పబ్లిక్ ప్లేస్ లో ప్రార్థనలు చేస్తే చైనాలో ఇలాంటిది జరుగుతుంది." అని చెబుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఎక్స్ పైన షేర్ అయిన పోస్టుల లింకులను ఇక్కడ చూడొచ్చు. (గ్రాఫిక్ వీడియో హెచ్చరిక) 
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో నమాజ్ చేస్తున్న ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడి అని మరికొందరు పేర్కొన్నారు.


 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఈ వీడియో పాతది. అది కూడా చైనాలో చోటు చేసుకున్నది కాదు. థాయ్ ల్యాండ్ లో జరిగిన ఘటన. మేము వీడియో కీఫ్రేమ్‌లను తీసుకున్నాం. వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. మాకు దొరికిన సాక్ష్యాల ప్రకారం ఈ వీడియో 2020 సంవత్సరం నాటిదని మేము కనుగొన్నాము.

డిసెంబర్ 2020లో amarintv.com అనే పేరు గల థాయ్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము. ఆ వార్తా నివేదికలో వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. అప్పులు వసూలు చేస్తున్న కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగి, తన కింది అధికారిపై దాడికి పాల్పడ్డాడని మీడియా నివేదికలో ఉంది.

This Morning’s Story అనే యూట్యూబ్ ఛానల్ ల ‘หนุ่มเปิดปากร่วมแก๊งทวงหนี้โหด ถูกกระทืบนอนซม 3 วัน หลังทวงเงินลูกค้าไม่ได้’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఆ టైటిల్ ప్రకారం ఈ ఘటన అప్పుల వసూళ్ల విషయంలో జరిగిన గొడవ అని తెలుస్తోంది. థాయ్‌లాండ్‌లోని సముత్ సఖోన్‌లో డబ్బును వసూలు చేయలేకపోయినందుకు, అప్పులు వసూలు చేసే కంపెనీకి చెందిన ఉద్యోగి మరొక ఉద్యోగిని దారుణంగా కొట్టాడు. సముత్ సఖోన్ సిటీ పోలీస్ స్టేషన్ బాధితుడిని ప్రశ్నించగా, దాడి చేసిన వ్యక్తి అనధికారిక రుణాలకు సంబంధించిన కంపెనీలో ఉన్నతాధికారి అని తెలిపాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

కంపెనీ వారు చెప్పినట్టు కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయలేకపోయినందున ఈ సంఘటన జనవరి 2020లో జరిగింది. దీని ఫలితంగా అతనిని శిక్షించారు. బాధితుడు 2019 అక్టోబర్‌లో ఫేస్‌బుక్ ద్వారా ఈ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాల్లో వ్యాపార కార్డులను అందజేసి రుణాలు ఇస్తారు, తరువాత అతను కస్టమర్ల నుండి వడ్డీ వసూలు చేయాల్సి వుంటుంది. నెలకు సగటున 30,000-40,000 భాట్‌లు వచ్చే జీతం, అధిక కమీషన్ ప్రోత్సాహకంగా ఉన్నందున అతను ఇక్కడ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, గత 3 నెలలుగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు లేదా కంపెనీ డబ్బును దుర్వినియోగం చేసినందుకు ఉద్యోగులపై భౌతిక దాడి ద్వారా తీవ్రంగా శిక్షించే 5-6 క్లిప్‌లను అతను రికార్డ్ చేసారు. 

Full View

చైనాలో పాకిస్తానీ వ్యక్తి రెస్టారెంట్‌లో నమాజ్ చేస్తున్నప్పుడు దాడి చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో పాతది, ఒక లోన్ కంపెనీ ఉద్యోగిపై దాడి జరిగింది.
Claim :  చైనాలోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ప్రార్థనలు చేయడంతో అతడిని కొట్టారు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News