ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది జమ్మూ కశ్మీర్‌లోని NH-44పై నిర్మించిన బ్రిడ్జి కాదు

NH44ని గతంలో NH7 అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని పొడవైన జాతీయ రహదారి. 3745 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఈ రహదారి.;

Update: 2024-10-02 06:08 GMT
Suspended bridge in China, Suspended bridge in Jammu and Kashmir, facts on viralvideo bridge on NH 44 in Jammu and Kashmiri, latest fact check news telugu

Jammu and Kashmir

  • whatsapp icon

NH44ని గతంలో NH7 అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని పొడవైన జాతీయ రహదారి. 3745 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఈ రహదారి. శ్రీనగర్‌ను కన్యా కుమారిని కలుపుతూ నిర్మించిన హైవే ఇది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాధించిన విజయాలను దేశ ప్రజలకు వివరించారు. గడ్కరీ జమ్మూ కశ్మీర్ లో రహదారులకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని వివరించారు. రహదారులు, సొరంగాల నిర్మాణంతో పాటూ ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి కారణంగా ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించారు. కీలకమైన గమ్యస్థానాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేలా చర్యలు కూడా తీసుకున్నారు.

ఢిల్లీ, కత్రా, శ్రీనగర్‌లను కలిపే ఎక్స్‌ప్రెస్‌వే 670 కి.మీ పొడవు ఉంటుంది. 4-లేన్ లతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. గూడ్స్ తరలింపును మరింత సులభతరం చేస్తుంది. జోజి లా టన్నెల్ ప్రాజెక్ట్ పూర్తీ చేయడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఇది ఆసియాలో అతిపెద్దది, లడఖ్ ప్రాంతంతో కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా పౌర, సైనిక కదలికలకు పెంచేందుకు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
కొండ ప్రాంతంలోని వంతెన నిర్మాణ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌హెచ్ 44ను చూపుతుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో జమ్మూ, బనిహాల్, లేహ్, పట్నిటాప్, బారాముల్లా, సింబా వంటి ప్రదేశాలను చూపుతుంది.


Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వంతెన జమ్మూ కాశ్మీర్ లోనిది కాదు. ఇది చైనాలోని వంతెన,
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేశాం. మా పరిశోధన సమయంలో, వీడియో బీపాంజియాంగ్ వంతెనను చూపుతుందని మేము కనుగొన్నాము.
సెప్టెంబర్ 21, 2024న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, నైరుతి చైనాలోని బీపాంజియాంగ్ వంతెన యునాన్, గుయిజౌ ప్రావిన్సులను కలుపుతుంది. ఆ కథనంలో వంతెనను చూపే చిత్రాన్ని కూడా ఉంచారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ వంతెనగా అధికారికంగా గుర్తింపును దక్కించుకుంది. ఇది బీపాన్ నది లోయ నుండి 565 మీటర్ల ఎత్తులో ఉంది.
‘Suspended 565m above China’s remote south-west mountains, the Beipanjiang Bridge took decades to construct and has revolutionized bridge-building around the world.’ అనే శీర్షికతో జూలై 2022లో BBC ప్రచురించిన వీడియో నివేదికను కూడా మేము గుర్తించాం. అందులో కూడా చైనాలోని బీపాంజియాంగ్ వంతెన యునాన్, గుయిజౌ ప్రావిన్సులను కలుపుతుందని తెలిపారు. బీపాన్ నది లోయపై నిర్మించిన అందమైన వంతెనను వీడియో చూపిస్తుంది.
చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (CGTN) కూడా వంతెనకు సంబంధించిన వీడియోను పంచుకుంది. చైనాలో ప్రపంచంలోని ఎత్తైన వంతెన ఉందని తెలిపింది. యునాన్, గుయిజౌ ప్రావిన్సుల జంక్షన్‌లో ఉంది. బీపాంజియాంగ్ వంతెన నదికి 565 మీటర్ల ఎత్తులో ఉంది. మూడేళ్ల తర్వాత నిర్మాణం అధికారికంగా పూర్తయింది. దాదాపు 1,000 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ ఎత్తైన ప్రాజెక్ట్‌లో పనిచేశారు. ఈ ఏడాది చివరికల్లా వంతెనను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏరియల్ టైమ్-లాప్స్ షాట్ ప్రపంచంలోని ఎత్తైన వంతెన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రాంతాన్ని కూడా చూపుతుంది. ఒక్కసారి చూడండని వీడియోను పంచుకుంది.
Full View
కాబట్టి, వైరల్ వీడియో జమ్మూ కశ్మీర్‌లోని NH 44లో పొడవైన వంతెనను చూపలేదు. ఇది చైనాలోని ఒక వంతెన. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  జమ్మూ కాశ్మీర్‌లోని NH-44పై నిర్మించిన బ్రిడ్జిని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News