ఫ్యాక్ట్ చెక్: బహుళ అంతస్థుల భవంతి కూలిపోతున్న వీడియో హైదరాబాద్ ది కాదు, హైడ్రా కూ సంబంధం లేదు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విపత్తు నిర్వహణ శాఖకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Update: 2024-09-28 05:01 GMT

high-rise building

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విపత్తు నిర్వహణ శాఖకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విభాగం పేరును హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (HYDRA)గా మార్చారు. హైడ్రాను అధికారికంగా జూలై 2024లో స్థాపించారు. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) విభాగం కింద పనిచేస్తుంది. ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, హైదరాబాద్‌లోని నీటి వనరులను రక్షించడం, పట్టణ ప్రాంతంలో విపత్తులు లేకుండా చేయడమే హైడ్రా ప్రధాన లక్ష్యం. 

హైడ్రా నగరంలోని పలు ప్రాంతాలకు సంబంధించి సర్వే ప్రారంభించింది. పార్కులు, నీటి వనరులు మొదలైనవాటిని ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను కూల్చివేయడాన్ని హైడ్రా ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని చెరువుల సమీపంలో, అమీన్‌పూర్‌లోని ఉస్మాన్ సాగర్ సమీపంలో కూల్చివేత డ్రైవ్ చేపట్టారు. హైడ్రా ఆధ్వర్యంలో విల్లాలు, ఇతర నివాస భవనాలను కూడా కూల్చివేశారు. కూల్చివేతలకు సంబంధించి తమకు తగిన నోటీసులు అందలేదని పేర్కొంటూ నివాసితులు పలు ప్రాంతాల్లో ఎదురు తిరిగారు. సరైన నోటీసులు లేకుండా బఫర్ జోన్‌లోని ఇళ్లను కూల్చివేయబోమని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ హామీ ఇచ్చారు. అయినా కూడా ఈ కూల్చివేతల సమయంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి, కొంతమంది నివాసితులు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించారు.
వీటన్నింటి మధ్య, హైదరాబాదులోని కోకాపేట్‌లో హైడ్రా భారీ భవనాన్ని కూల్చివేసినట్లు చూపుతున్న ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక ఎత్తైన భవనం కూలిన దృశ్యాన్ని చూపించే వీడియోను మనం చూడొచ్చు. వీడియోలో, 15 కంటే ఎక్కువ అంతస్తులతో ఉన్న భారీ భవనం పక్కకు కూలిపోవడాన్ని మనం చూడవచ్చు.
Full View

Full View
Full View
Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో పాతది. వైరల్ వీడియోకు హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేత డ్రైవ్‌లకు ఎటువంటి సంబంధం లేదు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వీడియో చాలా కాలం నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మేము కనుగొన్నాము. వీడియోని X వినియోగదారు సెప్టెంబర్ 4, 2024న “The construction of the "Aqua Garden" or "Avliga neighborhood" that blocked the flow of the Middle River has started to be demolished, but it will be a lesson to many corrupt people when they don't tear it down and throw it away.” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న "ఆక్వా గార్డెన్" లేదా "అవ్లీగా నైబర్ హుడ్" నిర్మాణాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. దానిని కూల్చివేస్తే చాలా మంది అవినీతిపరులకు ఇది గుణపాఠం అవుతుందని ట్వీట్ లో తెలిపారు. 
అయితే, ఈ పోస్ట్ లో తెలిపిన కధనానికి ఈ వీడియో సంబంధించిందా లేదా అనేది మేము దృవీకరించలేక పోయాం.

టెక్ ఎడ్యుకేషన్ స్పాట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో సెప్టెంబరు 11, 2024న “Excavator Destroying Anaconda Buildings” అనే క్యాప్షన్‌తో వీడియోను అప్లోడ్ చేశారు.
Full View
నాలెడ్జ్ టీవీ అనే మరో యూట్యూబ్ యూజర్ ‘कीतना रुपए का खर्स होता हैं और कैसे गिराते हैं _building demolition video’ అనే శీర్షికతో ఎత్తైన భవనాలు కూల్చివేసిన దృశ్యాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ 5, 2024న వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోను 0.05 సెకన్ల వద్ద నుండి చూడవచ్చు.
Full View
అక్టోబర్ 22, 2023న సారా జాకీ అనే ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేసిన వైరల్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఆ వీడియోలో ఇజ్రాయెల్ పాలస్తీనాలోని టవర్‌పై బాంబు దాడి చేసినట్లు చూపిస్తుంది.
Full View
మేము గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా టవర్‌పై బాంబు దాడికి సంబంధించిన నివేదికల కోసం వెతికినప్పుడు 28 అక్టోబర్ 2023 నాటి వీడియోను కనుగొన్నాం. ఇజ్రాయెల్ వైమానిక దళం ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జబాలియా శరణార్థి శిబిరంలోని నివాస భవనాలపై బాంబు దాడి చేసింది, ఈ ఘటనలో 50 మంది మరణించినట్లు మేము కనుగొన్నాము. 31 అక్టోబర్ 2023న, జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన వైమానిక దాడిని "భారీ ఊచకోత"గా అభివర్ణించారు. 
కానీ, వైరల్ వీడియో ఈ ఘటన కి సంబంధించింది కూడా కాదు.
వైరల్ వీడియోను నవంబర్ 2023లో RisovakaTV అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రచురించింది.
Full View
కొన్ని సంవత్సరాల నుంచీ ఈ వీడియో వివిధ ప్రదేశాలకు సంబంధించి అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ వీడియో ఏ ప్రదేశానికి చెందినదో దృవీకరించలేక పోయినా, వైరల్ వీడియో హైదరాబాద్ నగరానికి చెందినది కాదు అని మాత్రం మేము నిర్ధారించాము. హైడ్రా కూల్చివేతలకు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  భారీ భవంతిని హైదరాబాద్ లోని కోకాపేటలో కూల్చివేశారు.
Claimed By :  Youtube Users
Fact Check :  False
Tags:    

Similar News