నిజ నిర్ధారణ: బాడీ బిల్డర్ తన బహుమతిని తన్నుతున్న వైరల్ వీడియో భారతదేశానికి చెందినది కాదు బంగ్లాదేశ్ ది
ఒక బాడీ బిల్డర్ తన బహుమతి సమారోహం అయిన తరువాత, తన బహుమతి ని తీసుకుని, దానిని తన్నుతున్న వీడియో వైరల్‌గా షేర్ అవుతోంది, ఈ వీడియో భారతదేశంలోనిదని, అతనిని తన కులం పేరుతో అవమానించారని అందుకే అతను కోపంగా తనకి ఇచ్చిన బహుమతి ని తన్ని వెళ్లిపోయాడనీ ప్రచారం చేస్తున్నారు.
ఒక బాడీ బిల్డర్ తన బహుమతి సమారోహం అయిన తరువాత, తన బహుమతి ని తీసుకుని, దానిని తన్నుతున్న వీడియో వైరల్‌గా షేర్ అవుతోంది, ఈ వీడియో భారతదేశంలోనిదని, అతనిని తన కులం పేరుతో అవమానించారని అందుకే అతను కోపంగా తనకి ఇచ్చిన బహుమతి ని తన్ని వెళ్లిపోయాడనీ ప్రచారం చేస్తున్నారు.
వీడియోలో మెడల్, మిక్సర్ ను అందించడం చూడవచ్చు, ఆపై అతను నిర్వాహకులలో ఒకరితో వాదించాడు, ఆయన అతనిని వెనుక నిలబడమని చెప్పాడు. ఆవేశంతో, అతను మిక్సర్ ను తన్ని, ఆపై బయటికి వెళ్లిపోయాడు.
వీడియో ఈ తెలుగు క్యాప్షన్ తో ప్రచారంలో ఉంది. “టాలెంట్ ఎంత ఉన్నా కులాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది డిజిటల్ ఇండియాలో అతని ప్రతిభని గుర్తించండి రా తక్కువ కులం వాడు అవమానించకండి తక్కువ కులం వాడైతే ఏందిరా మనిషి కాదా అతను”
https://www.facebook.com/
ఈ క్లెయిం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ:
బాడీబిల్డర్‌ను భారతదేశంలో కులం పేరుతో అవమానించారనే వాదన అబద్దం. ఈ ఘటన భారత్‌లో కాదు, బంగ్లాదేశ్‌లో జరిగింది.
వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదని, వీడియోలో ఉన్న బాడీ బిల్డర్ పేరు జాహిద్ హసన్ షువో అని తెలుస్తోంది.
ఎసెన్షియల్లీ స్పోర్ట్స్.కాం ప్రకారం, పోటీలో రన్నరప్‌గా నిలిచిన జాహిద్ హసన్ షువో, బహుమతి ప్రదర్శన సమయంలో తన బహుమతిని తన్నాడు. షూవో బ్లెండర్‌ని బహుమతిగా అందుకున్నాడు, అది అతనికి సంతోషాన్ని కలిగించలేదు. నిరాశతో, అతను బాక్స్‌ను తన్నడం ప్రారంభించాడు, బంగ్లాదేశ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్‌ను ఖండించాడు.
జాహిద్ హసన్ షువో, 28 ఏళ్ల బాడీబిల్డర్, 2022 బిబిఎఫ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పురుషుల ఫిజిక్ 170 సెం.మీ ప్లస్ విభాగంలో పోటీపడి రజత పతకాన్ని సాధించగలిగాడు. ఈ ఫలితాలతో అతను సంతృప్తి చెందలేదు, "నాకు, విజేతకు మధ్య శరీరాకృతిలో ఉన్న తేడాను ఒక పిల్లవాడు కూడా చెప్పగలడు."
ఈ నివేదికలో వైరల్ వీడియో కూడా షేర్ చేయబడింది.
నివేదికల ప్రకారం, తన కోపం బ్లెండర్‌ను స్వీకరించడంపై కాదని, ఫెడరేషన్‌లో అవినీతి అని అతను ఖండించాడనీ షువో వివరించాడు.
"ఇది అవినీతిపై కిక్. మన దేశంలో ఏ ప్రదేశంలోనైనా అవినీతి" అని ఆతను మీడియాతో అన్నాడు. బాడీబిల్డింగ్ ఫెడరేషన్ ప్రతిస్పందనగా వారి పోటీల నుండి షువోపై జీవితకాల నిషేధం విధించింది.
బిబిఎఫ్ నిర్ణయానికి 'క్రమశిక్షణ ఉల్లంఘన' కారణంగా పేర్కొంది. ఈ విషయం గురించి ఢాకా ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ మాజీ బాడీబిల్డర్ హాజీ పెయార్ మొహమ్మద్ (ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలలో ఒకరు) జాహిద్ చర్యలపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కనుక, బాడీ బిల్డర్ తన బహుమతిని తన్నుతున్న వైరల్ వీడియో భారతదేశానికి చెందినది కాదు, అతని దూకుడుకు కారణం దేశంలోని కుల వ్యవస్థ కాదు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. వాదన అవాస్తవం .