ఫ్యాక్ట్ చెక్: డ్రోన్‌ల ద్వారా భారీ వాహనాలను ఆకాశంలో తీసుకుని వెళ్తున్నట్టు చూపించే వైరల్ వీడియోను CGI ద్వారా సృష్టించారు

రోడ్లపై ట్రాఫిక్ అడ్డంకిని నివారించడానికి.. అంబులెన్స్‌లు, ట్రక్కులు, కార్లు మొదలైన భారీ వాహనాలను ఆకాశంలో మోసుకెళ్తున్న డ్రోన్‌ల వీడియో వైరల్ అవుతూ ఉంది. నిజమైన డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి.. రవాణాను సులభతరం చేస్తున్నారనే వాదనతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.;

Update: 2024-04-03 09:50 GMT

రోడ్లపై ట్రాఫిక్ అడ్డంకిని నివారించడానికి.. అంబులెన్స్‌లు, ట్రక్కులు, కార్లు మొదలైన భారీ వాహనాలను ఆకాశంలో మోసుకెళ్తున్న డ్రోన్‌ల వీడియో వైరల్ అవుతూ ఉంది. నిజమైన డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి.. రవాణాను సులభతరం చేస్తున్నారనే వాదనతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. కొంతమంది YouTube వినియోగదారులు ఈ వీడియోను “అద్భుతమైన అంబులెన్స్ సర్వీస్”, “జపాన్ టెక్నాలజీ” వంటి క్యాప్షన్‌లతో షేర్ చేసారు

Full View
Full View

Full View
“We are in the future where drones are carrying heavy vessel! Dope” అనే క్యాప్షన్ తో ఇన్స్టాగ్రామ్ యూజర్లు పోస్టులు పెడుతున్నారు. టెక్నాలజీ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిందని చెబుతూ వీడియోను పోస్టు చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:


వీడియోలో అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ ఉందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించిన వీడియో ఇదని మేము గుర్తించాం.

నిశితంగా గమనించగా వీడియోలో @pacifico_seguros అనే లోగోను మనం గమనించవచ్చు.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేయడమే కాకుండా.. 'Pacifico Seguros' అనే కీవర్డ్‌లతో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. అదే వీడియోని Facebook పేజీ Pacifico Segurosలో చూశాం. స్పానిష్‌లో “Liberamos nuestros drones por la Panamericana Sur para monitorear అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్టు చేశారు. ప్రతి కి.మీ ని పర్యవేక్షించడానికి, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి మేము మా డ్రోన్‌లను ఉపయోగిస్తాము అని అందులో చెప్పారు.
Full View

Full View
వెబ్‌సైట్ ప్రకారం, పసిఫికో సెగురాస్ Pacifico Seguras పెరూలో బీమా ప్రొవైడర్
కంపెనీ యొక్క లింక్డ్‌ఇన్ పేజీ మార్చి 27, 2024న వైరల్ వీడియోను షేర్ చేసింది. “కొన్ని రోజుల క్రితం మేము మా CGI ప్రకటనల ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టాము. మనలో చాలా మంది నిజమని నమ్ముతున్నట్లు మాకు అర్థమైంది. అసలు విషయమేమిటంటే.. మిమ్మల్ని రక్షించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. సౌత్ పాన్-అమెరికన్ హైవేపై 4 స్టేషన్‌లను ఏర్పాటు చేసాము. మీకు తక్షణమే సహాయం చేయడానికి మా వద్ద అంబులెన్స్‌లు, టో ట్రక్కులు.. డ్రోన్‌ల బృందం ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహాయం అందించగలము అనే విషయాన్ని వివరించడానికి.. ఇలా వీడియోను సృష్టించారు. ఈ వీడియో పసిఫికో సెగురోస్ విడుదల చేసిన CGI ప్రకటన అని మేము నిర్ధారించాం.
Full View
mercadonegro.peలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. పసిఫికో సెగురోస్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ ట్రెండ్‌లో చేరిందని, కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వీడియోలో, ఈ డ్రోన్‌లు కంపెనీ వాహనాలను నగరానికి దక్షిణంగా తీసుకెళ్లడానికి ఎలా లోడ్ చేస్తాయో మీరు చూడవచ్చని వివరించారు. కేవలం కంప్యూటర్ జెనరేటెడ్ వీడియో ఇదని మాత్రమే అందులో తెలిపారు. అంతే తప్ప ఒరిజినల్ వీడియో అని ఎక్కడా కూడా చెప్పలేదు.
వైరల్ వీడియోను కంప్యూటర్ సీజీఐ ద్వారా సృష్టించారు. అంతేతప్ప ఒరిజినల్ డ్రోన్ టెక్నాలజీ కాదు. కాబట్టి.. వీడియోను నిజమని నమ్మకండి.
Claim :  The video shows new technology of drones that can carry heavy vehicles in the sky
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News