ఫ్యాక్ట్ చెక్: అయోధ్యలో రోడ్లు ధ్వంసమయ్యానని చెబుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 11 మంది చనిపోయారు. అయోధ్యలో కూడా వర్షాలు విధ్వంసం సృష్టించాయి. సరయు నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 11 మంది చనిపోయారు. అయోధ్యలో కూడా వర్షాలు విధ్వంసం సృష్టించాయి. సరయు నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వర్షాల కారణంగా రామ్‌పథంలో కొత్తగా నిర్మించిన రోడ్లు కుంగిపోవడంతో అధికారులు స్పందించి ప్యాచ్‌లను వేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆ ప్రాంతంలోని రోడ్ల నాణ్యతను విమర్శించడం మొదలుపెట్టారు.
వర్షాలు మరియు వరదల కారణంగా భారీగా ధ్వంసమైన రహదారిని చూపించే వీడియో అంటూ వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా వీడియోలో కనిపించే రహదారి అయోధ్య నుండి కొత్తగా నిర్మించిన రహదారి అని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారి అని యూట్యూబ్‌లో తెలిపారు. అయోధ్యలోని రోడ్లు చాలా తక్కువ నాణ్యతతో ఉన్నాయని సూచిస్తూ యూజర్లు వీడియోను షేర్ చేశారు. కేవలం రెండుసార్లు వర్షం కురవగానే అయోధ్యలో కొత్తగా వేసిన రోడ్లు నాశనం అయ్యాయని తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో అయోధ్యకు సంబంధించి కాదు.. వైరల్ వీడియో లోని రోడ్లు దుబాయ్ కు సంబంధించింది.
వైరల్ వీడియో నుండి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా.. వైరల్ వీడియోను X వినియోగదారు ధృవ్ రాతీ కూడా షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము, కానీ ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించాడు. అయితే ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా.. చాలా మంది వినియోగదారులు ఈ వీడియో దుబాయ్‌కి చెందినదని షేర్ చేశారు.
ట్వీట్‌లో చూపిన వీడియో అయోధ్యకు చెందినది కాదంటూ.. అయోధ్య పోలీసులు కూడా వైరల్ వాదనను ఖండించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
తదుపరి శోధనలో, మేము దుబాయ్ AEAEAE శీర్షికతో ఏప్రిల్ 2024లో ప్రచురించిన YouTube వీడియోలను కూడా కనుగొన్నాము.
‘దుబాయ్ మే మందిర్ ఓపెన్ హోనే సే కే హువా’ పేరుతో మరో యూట్యూబ్ ఛానెల్ లో ఇదే వీడియోను అప్లోడ్ చేశారు.
వీడియో ఖచ్చితంగా దుబాయ్‌కి చెందినదా.. కాదా.. అని మేము నిర్ధారించలేనప్పటికీ, వీడియో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు సంబంధించినది అయితే కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అయోధ్యలో రామమందిరం సమీపంలో ధ్వంసమైన రోడ్డు వైరల్ వీడియోలో ఉంది
Claimed By : Youtube Users
Fact Check : False