ఫ్యాక్ట్ చెక్: కరోనా వైరస్ కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు.
ఇటీవలి కాలంలో కరోనా కేసులకు సంబంధించిన టెన్షన్ పెరిగిపోయింది. అంతేకాకుండా మరోసారి ఫేక్ న్యూస్ వీర విహారం చేస్తూ ఉన్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి టెన్షన్ మొదలైంది.
ఇటీవలి కాలంలో కరోనా కేసులకు సంబంధించిన టెన్షన్ పెరిగిపోయింది. అంతేకాకుండా మరోసారి ఫేక్ న్యూస్ వీర విహారం చేస్తూ ఉన్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి టెన్షన్ మొదలైంది.
తాజా కోవిడ్-19 కేసులకు సంబంధించిన నివేదికల కారణంగా తప్పుడు సమాచారం కూడా ఎక్కువవుతూ ఉంది. ఇక కోవిడ్-19కి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రభుత్వం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుందనే వాట్సాప్ సందేశం వైరల్ అవుతోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ఈ సందేశం వచ్చిందని.. ఎవరు పడితే వాళ్లు వైరస్‌పై సమాచారాన్ని షేర్ చేయకూడదని.. కేవలం ప్రభుత్వ ఏజెన్సీ మాత్రమే సమాచారాన్ని పోస్ట్ చేస్తుందని అన్నారు. ఎవరైనా అలా చేస్తే, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ పై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తారని, అలాగే చర్యలు తీసుకుంటారని వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు.
పలువురు యూజర్లు ఈ వైరల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా నిజనిర్ధారణ బృందం హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను పరిశీలించింది. వైరల్ అవుతున్న సందేశం ఆపాదించబడిన రవి నాయక్ అనే ప్రభుత్వ అధికారికి సంబంధించిన సమాచారం ఎక్కడా లేదు. ఈ సందేశం ప్రభుత్వం లేదా సంబంధించిన అధికారులెవరూ పంపలేదని స్పష్టంగా తెలుస్తోంది.
కరోనా వైరస్ కు సంబంధించిన ఏదైనా వార్తలను పోస్ట్ చేయడంపై హోం మంత్రిత్వ శాఖ శిక్షార్హమైన నేరంగా ప్రకటించిందని పేర్కొన్న వార్తా నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు. అంతేకాకుండా ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PBI) అధికారికంగా ఇందుకు సంబంధించిన ట్వీట్ చేసి, సందేశాన్ని నకిలీ అని తేల్చింది. ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.
కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయడం శిక్షార్హమైన నేరం కాదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ స్పష్టంగా పేర్కొంది. వినియోగదారులు ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారాన్ని పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఇలాంటి మెసేజ్ వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అదే వాట్సాప్ మెసేజ్ 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ దశలో వైరల్ అయ్యింది. అప్పుడు కూడా ఇందులో నిజం లేదని తేలింది. 'రవి నాయక్' అనే పేరు ఉన్న వ్యక్తి ఎవరూ లేరని.. ప్రిన్సిపల్ సెక్రటరీ అనే హోదా కూడా లేదని క్వింట్ మీడియా సంస్థ తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు.. ఒక గాలి వార్త అని తేలింది. దాన్ని ఎవరూ నమ్మకండి.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు.. ఒక గాలి వార్త అని తేలింది. దాన్ని ఎవరూ నమ్మకండి.
Claim : Posting any information related to Covid-19 on social media will be considered as a punishable offense by the government. They would be registered under the IT Act.
Claimed By : Social Media Users
Fact Check : False