పెను ప్రమాదం నుండి తప్పించుకున్న రాజా సింగ్
అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రాజా సింగ్, ఆయన కుటుంబం శుక్రవారం జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రలో చోటు చేసుకున్న ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది యాత్రికులు మరణించారు. గోషామహల్ ఎమ్మెల్యే హెలికాప్టర్ ద్వారా అమర్‌నాథ్ చేరుకున్నారు.
టెంట్లను వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. అమర్‌నాథ్‌లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు.. పెద్ద శబ్దంతో వరద దూసుకొస్తూ కనిపించిందని, భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారని తాను చూసిన ఆ భయానక దృశ్యం గురించి చెప్పారు. తమకు కొద్ది దూరంలోనే ఎంతోమంది వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించారని, తమకు కూడా భయం వేసిందని అన్నారు. అదృష్టవశాత్తు సమయానికి గుర్రాలు దొరకడంతో వాటిపై కిందికి బయలుదేరామన్నారు. కిందికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సమకూర్చి తనను, తన కుటుంబాన్ని శ్రీనగర్ చేర్చినట్టు చెప్పారు.
అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు, పోలీసు బృందాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సహాయ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.