Hyderabad : కుక్కను తరుముతూ కింద పడి యువకుడి మృతి

కుక్కు ను తరుముతూ ఒక యువకుడు మూడో అంతస్థు నుంచి కింద పడి మరణించిన ఘటన చందానగర్ లో జరిగింది;

Update: 2024-10-22 04:32 GMT
Hyderabad :  కుక్కను తరుముతూ కింద పడి యువకుడి మృతి
  • whatsapp icon

కుక్క ను తరుముతూ  ఒక యువకుడు మూడో అంతస్థు నుంచి కింద పడి మరణించిన ఘటన చందానగర్ లో జరిగింది. చందానగర్ లో ఉన్న వీవీ ప్రైడ్ హోటల్ లో తన స్నేహితులతో కలసి ఉదయ్ అనే వ్యక్తి వచ్చాడు. తెనాలికి చెందిన ఉదయ్ స్నేహితులతో కలసి ఈ హోటల్ కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

తెనాలికి చెందిన...
పోలీసులు అందించిన సమాచారం మేరకు తెనాలికి చెందిన ఉదయం హోటల్ కు చేరుకుని మూడో అంతస్థులో ఉండటంతో అక్కడ కుక్క కనపడటంతో దాని వెంట పడ్డారు. దానిని తరుముతూ ప్రమాదవశాత్తూ ఉదయ్ కింద పడ్డాడు. మరణించాడు. అయితే ఈ ఘటన ఆదివారం జరిగినా బయటకు రాకుండా హోటల్ నిర్వాహకులు జాగ్రత్త పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.



Tags:    

Similar News