టోల్ ప్లాజా ను దాటాలంటే ఎంత కష్టమో మరి..?
సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు;

సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద నిదానంగా వాహనాల రాకపోకలు నడుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పోలీసులు దగ్గరుండి వాహనాలను త్వరితగతిన వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సెలవులు పూర్తి కావడంతో...
సంక్రాంతి సెలవులు అయిపోయాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నవారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నిన్నటి నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు అక్కడే ఉండి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు.