గుండెపోటుతో చీతా మృతి

నెహ్రూ జూలాజికల్ పార్కులో చీతా మరణించింది. అబ్దుల్లా అనే పేరు గల చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.;

Update: 2023-03-26 04:49 GMT
గుండెపోటుతో చీతా మృతి
  • whatsapp icon

నెహ్రూ జూలాజికల్ పార్కులో చీతా మరణించింది. అబ్దుల్లా అనే పేరు గల చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. గుండెపోటుతో చీతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఎండలు పెరిగిపోతుండటంతో జంతువుల ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

హైదరాబాద్ జూలో...
పదిహేనేళ్ల వయసున్న అబ్దుల్లా అనే చీతా మరణించడంతో జూ అధికారులు దానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. మిగిలిన చీతాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చీతా మరణించడంతో ఈ వేసవిలో జంతు సంరక్షణ జూ అధికారులకు సవాల్ గా మారింది.


Tags:    

Similar News