Cyberabad Police: 254 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్, ముంబైకి వెళుతుండగా

Update: 2024-09-10 15:13 GMT

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌, ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఐదుగురు డ్రగ్స్‌ స్మగ్లర్లను సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) రాజేంద్రనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 254 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ రూ. 88,90,000 ఉంటుందని అంచనా చేస్తున్నారు. అధిక డిమాండ్ కారణంగా ఒక్కో కిలో ధర రూ. 35,000 దాకా పాలకొచ్చు. నిందితుల దగ్గర .32 క్యాలిబర్ కంట్రీ-మేడ్ పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు మారుతీ సుజుకి ఎర్టిగా కార్లు, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక కీప్యాడ్, నగదు రూ. 3,700, జియో డాంగిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులలో కీలకమైన వ్యక్తి ఠాకూర్ సచిన్ సింగ్ (30) అని తెలుస్తోంది. మిగిలిన నలుగురు మహ్మద్ నదీమ్ (21), మహ్మద్ సక్లైన్ (24), మహ్మద్ సలీమ్ (24), ప్రశాంత్ సింగ్ (22)లుగా గుర్తించారు.

నిందితులు సెప్టెంబర్ 10, 2024 న, హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్, ముంబైకి వెళుతుండగా ఈ బృందం 100 కిలోల గంజాయిని మరొక వాహనానికి తరలించడానికి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద ఆగింది. విశ్వసనీయ సమాచారం మేరకు, SOT రాజేంద్రనగర్ బృందం, రాజేంద్రనగర్ పోలీసులు ఎగ్జిట్ నంబర్ 17 సమీపంలోని ORR సర్వీస్ రోడ్డు వద్ద రెండు వాహనాలను అడ్డుకున్నారు. OD 33 V 3204 రిజిస్ట్రేషన్ నంబర్ గల వాహనంలో 254 కిలోల ఎండు గంజాయి ఉంది. MH 01 EE 4530 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఇతర వాహనం పైలటింగ్ కోసం ఉపయోగించారు. పోలీసులను చూడగానే వినోద్ కుమార్ యాదవ్, రవీందర్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఠాకూర్ సచిన్ సింగ్ నుంచి గంజాయి .32 క్యాలిబర్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా ఒక వాహనానికి నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించినట్లు ఆ తర్వాత గుర్తించారు.


Tags:    

Similar News