Hyderabad : హైదరాబాద్ లో డబుల్ బెడ్‌రూంలకు నో.. త్రిబుల్ బెడ్ రూమ్‌లకు ఓకే

హైదారాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు గిరాకీ తగ్గింది. ఎక్కువ కుటుంబాలు ట్రిపుల్ బెడ్ రూంలనే కొనుగోలు చేస్తున్నాయి

Update: 2024-10-27 06:09 GMT

హైదారాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు గిరాకీ తగ్గింది. ఎక్కువ కుటుంబాలు ట్రిపుల్ బెడ్ రూంలనే కొనుగోలు చేస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉండటంతో భవిష్యత్ లో ముగ్గురి కోసం ట్రిపుల్ బెడ్ రూంలనే కొనుగోలు చేస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా డబుల్ బెడ్ రూం కొనుక్కొని ఇరుకు ఇళ్లలో ఉండలేక అనేక మంది ట్రిపుల్ బెడ్ రూం వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు డబుల్ బెడ్ రూం ఇళ్లవైపు కూడా ఎవరూ మొగ్గు చూపకపోతుండకపోవడం, డిమాండ్ తగ్గిపోవడంతో బిల్డర్లు కూడా తమ వెంచర్లలో వీటికి ఎక్కువ చోటు కల్పించడం లేదు.

ఖాళీగా డబుల్ బెడ్ రూం...
ఏదైనా పెద్ద ప్రాజెక్టులో అయితే తప్ప డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం హైదరాబాద్‌లో జరగడం లేదు. కొత్తగా చేపట్టబోయే ఏ ప్రాజెక్టులోనైనా ముందు ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో వాటి నిర్మాణాలనే త్వరితగతంగా పూర్తి చేస్తున్నారు. డబుల్ బెడ్ రూంలను పక్కన పెడుతున్నారు. ఎవరైనా వచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న తర్వాతనే వాటిని పూర్తి చేస్తున్నారు. అంతే తప్ప ముందు పెట్టుబడి పెట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లను రెడీ చేసినా వాటిని కొనుగోలు చేసే వారు లేక అవి చాలా మిగిలిపోయాయి ఉన్నాయ. హైదరాబాద్ లోని అనేక వెంచర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు బోల్డెన్ని ఖాళీగా ఉన్నాయి.
మూడు బెడ్ రూంలు ఉంటే...
ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో పాటు సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు, రిటైర్ అయిన ఉద్యోగులు ఎక్కువగా ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లవైపు ఆసక్తి కనపరుస్తున్నారు. దీని వల్ల స్పేస్ మాత్రమే కాకుండా భవిష్యత్ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని, కుటుంబం మొత్తం గడపటానికి కంఫర్ట్‌గా ఉంటుందని భావించి ట్రిపుల్ బెడ్ రూంలను ఎంచుకుంటున్నారు. ఎక్కువ చదరపు గజాలు లేకపోయినా మూడు బెడ్ రూంలు ఉంటే చాలు అవి వెంటనే అమ్ముడు పోతున్నాయని రియల్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో తమ వారసులు కూడా ఇక్కడే స్థిరపడాలని కోరుకునే వారంతా ప్రస్తుతం ఉంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను విక్రయించి ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
సింగిల్ బెడ్ రూం తరహాలోనే..
కొన్నేళ్లుగా హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తక్కువగానే జరుగుతుంది. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో తప్ప పెద్ద వెంచర్లు ఏవీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదు. గిరాకీ తగ్గిపోవడంతో పాటు భవన నిర్మాణానికి అనవసర వ్యయం ముందుగా ఖర్చు పెట్టి అప్పులకు వడ్డీ చెల్లించి రావాల్సి వస్తుండటంతో బిల్డర్లు వీటి నిర్మాణానికి వెనక్కు తగ్గారు. దీంతో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో కట్టిన ఇళ్లే ఇంకా కొనుగోలుకు నోచుకోలేదు. అనేక సార్లు రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఎక్స్ పోలో కూడా ఎవరూ డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆరా తీయకపోవడం కూడా ఇందుకు అద్దం పడుతుంది. మొత్తం మీద హైదరాబాద్ లో ట్రిపుల్ బెడ్ రూం ఇళ్ల కల్చర్ ప్రారంభమయింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు రానున్న కాలంలో ఇక రాం రాం.. చెప్పకతప్పదంటున్నారు. చాలా రోజుల నుంచి సింగిల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరగనట్లే డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా అదే పరిస్థితి తలెత్తింది.


Tags:    

Similar News