Hyderabad : రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో ఒక కట్టెల దుకాణంలో ఈ మంటలు వ్యాపించాయి.;

Update: 2023-12-27 03:05 GMT
fire accident, rajendranagar, hyderabad, fire department, telangana news, hyderabad news, crime news, fire accident has taken place in the city of hyderabad, AllwynPharma Fire Accident :

 fire accident has taken place in the city of hyderabad

  • whatsapp icon

హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో ఒక కట్టెల దుకాణంలో ఈ మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న సోఫాల ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఇళ్లలో నుంచి సిలిండర్లు తీసుకుని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

లక్షల్లో ఆస్తి నష్టం...
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఏడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. ఒక్కసారి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాధమిక సమాచారం మేరకు అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించారు.


Tags:    

Similar News