Hydra : హైడ్రా ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసా? మళ్లీ రెడీ అయిపోతుందా?

గత కొద్ది రోజుల నుంచి హైడ్రా కామ్ గా మారింది. ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు.

Update: 2024-11-05 07:22 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్' ఇప్పుడు ఏం చేస్తుంది? ఇదే అందరి నోళ్లలో నానుతుంది. గత కొద్ది రోజుల నుంచి హైడ్రా కామ్ గా మారింది. ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత కొంత కాలం హడావిడి చేసిన హైడ్రా అధికారులు ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో కొంత వెనక్కు తగ్గారు. అయితే హైడ్రా రెండు అడుగులు వెనక్కు వేసిందంటే మరో నాలుగు అడుగులు ముందుకు వేయడానికే నంటున్నారు హైడ్రా అధికారులు. కొంత సమయం తీసుకుని ఆక్రమణల కూల్చివేతలను తిరిగి ప్రారంభించేందుకు హైడ్రా సిద్ధమవుతుందని తెలిసింది.

గుర్తించి.. న్యాయనిపుణులతో...
అయితే ముందుగా హిమాయత్ సాగర్ వంటి ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించే పనిలో హైడ్రా అధికారులున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా నగరంలో కొన్ని ప్రధాన కాల్వల కింద ఉన్న భవనాల విషయంలోనూ అన్ని రకాలుగా వివరాలను సేకరించే పనిలో ఉన్నారట. అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా హైడ్రా అధికారులు అన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకుంటున్నారు. నోటీసులు ముందుగా వారికి పంపిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అక్కడ తమకు అనుకూలంగా ఫలితం వచ్చేలా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇందుకోసం న్యాయనిపుణులతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు సమాచారం.
వారం రోజుల్లోనే...
మరో వారం రోజుల్లోనే హైడ్రా బుల్ డోజర్ స్టార్టవుతుందని తెలిసింది. అయితే ఇది ఎటువైపు వెళుతుందన్న సమాచారాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు సర్వాధికారాలును కల్పిస్తూ ఆర్డినెన్స్ ను కూడా అమలులోకి తెచ్చింది. మంత్రి వర్గ సమావేశం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ను గవర్నర్ కూడా ఆమోదించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు సంబంధించిన అనేక అంశాలపపై చర్చలు జరిపి తర్వాత ఆర్డినెన్స్ ను ఆమోదించడమే కాకుండా మరిన్ని విస్తృతాధికారాలు కల్పించాలని, చట్టబద్ధత కూడా కల్పించి దానిని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. మొత్తం మీద హైడ్రా మళ్లీ స్టార్టవుతుందని చెబుతున్నారు. ఈసారి హైడ్రా బుల్ డోజర్ ఎటు వైపు దూసుకువస్తుందో మరి చూడాలి.
Tags:    

Similar News