శంషాబాద్ లో కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు

Update: 2023-08-12 13:36 GMT

శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానంలో శంషాబాద్‌కు వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి రూ.4.86 కోట్ల విలువైన 8కిలోల బంగారాన్ని సీజ్‌ చేసినట్టు కస్టమ్స్‌ అధికారులు చెప్పారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రెండు కిలోల బంగారు కడ్డీలు, అదే విమానంలో వచ్చిన మరొకరి నుంచి 1.78 కిలోల బంగారపు కడ్డీలు స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 2.17కిలోల బంగారం, దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 2.05కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురిని శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తులపై అనుమానం వచ్చి పరిశీలించగా భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. ఈ మొత్తం బంగారం విలువ రూ.4.86 కోట్లు కావడంతో అందరూ షాక్ అయ్యారు. బ్యాంకాక్​ నుంచి హైదరాబాద్​కి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గమనించగా వారిని అదుపులోకి తీసుకుని ఆ ఇద్దరి వద్ద 3.78 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని నుంచి 2.17 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్​ నుంచి వస్తున్న మరో వ్యక్తి దగ్గర 2.5 కిలోల బంగారాన్ని గుర్తించారు అధికారులు.


Tags:    

Similar News