విషాదం.. సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు

ఆ సమయంలో ఇంటిలో ఉన్న ఏడుగురికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పివేసి పద్మ కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రికి..;

Update: 2023-07-11 12:55 GMT
domalguda cylinder blast

domalguda cylinder blast

  • whatsapp icon

పిండి వంటలు చేస్తుండగా.. సిలిండర్ పేలడంతో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని దోమలగూడలో జరిగింది. మంగళవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలగూడలో నివాసం ఉంటున్న పద్మ బోనాల పండుగ సందర్భంగా కూతురు-అల్లుడు, బంధువులను మూడురోజుల క్రితమే ఇంటికి ఆహ్వానించింది. బోనాల పండుగ నేపథ్యంలో ఇల్లంతా సందడిగా మారింది. ఉదయం ఇంట్లో పిండివంటలు చేస్తుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి.

ఆ సమయంలో ఇంటిలో ఉన్న ఏడుగురికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పివేసి పద్మ కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని దోమలగూడ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విషమంగా ఉన్నవారిలో అభినవ్ (8), శరణ్య (6), విహార్ (3) ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.


Tags:    

Similar News