హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఎత్తున బంగారం పట్టివేత జరిగింది. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు

Update: 2023-07-30 11:51 GMT

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఎత్తున బంగారం పట్టివేత జరిగింది. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అధికారులు సైతం ఆశ్చర్యపోయే విధంగా స్మగ్లర్లు బంగారాన్ని ఎయిర్‌పోర్ట్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరకు అధికారులు ఇచ్చే ట్విస్ట్‌తో స్మగ్లర్లు శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకుంటున్నారు. ఓ లేడీ కిలాడీ అధికారుల చేతికి ఏమాత్రం చిక్కకుండా లక్షల విలువైన బంగారాన్ని ఎయిర్‌పోర్ట్ దాటించేందుకు పక్కా ప్లాన్ చేసింది. కానీ చివరకు అది బెడిసి కొట్టడంతో ఆ లేడీ కిలాడి అధికారుల చేతికి చిక్కింది. అబుదాబి నుండి హైదరాబాద్‌కు ఓ లేడి కిలాడీ వచ్చింది.

ఈ లేడీ కిలాడి ముందుగా అబుదాబి నుండి చెన్నైకి చేరుకున్న సమయంలోనే అధికారుల చేతికి చిక్కకుండా బంగారాన్ని పేస్ట్‌గా చేసి ఆ పేస్ట్‌ని విమానంలో ఉన్న టాయిలెట్ లోని వాష్ బేసిన్ కింద దాచి పెట్టింది. అనంతరం ఈ లేడి స్మగ్లర్ చెన్నై నుండి హైదరాబాద్‌కి విచ్చేసింది.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ లేడి నడవడిక మీద అధికారులకు అనుమానం రావడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అక్రమ బంగారం వ్యవహారం కాస్త గుట్టు రట్టు అయింది. దీంతో కస్టమ్స్ అధికారులు వెంటనే లేడి కిలాడీని అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి 94.99 లక్షల విలువ చేసే1.329 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. 

Tags:    

Similar News