Hyderabad Metro : రికార్డు స్థాయిలో ప్రయాణికులు.. ఒకే రోజు 5.47 లక్షల మంది

హైదరాబాద్ మెట్రో ఒక రికార్డును సాధించింది. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణించారు.

Update: 2023-11-06 04:48 GMT

metro trains in hyderabad

హైదరాబాద్ లో మెట్రో రైలు వచ్చిన తర్వాత ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చడంలో మెట్రో ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి మెట్రో రైలు ప్రయాణానికి అలవాటు పడితే ఇక సొంత వాహనాన్ని తీసే ప్రయత్నం ఎవరూ చేయరు. తక్కువ ఖర్చుతో సుఖంగా, వేగంగా గమ్యస్థానాన్ని చేర్చడంలో హైదరాబాద్ మెట్రో మంచి సేవలు అందిస్తుంది. అందుకే రోజురోజుకూ మెట్రోకు ఆదరణ పెరుగుతుంది.

సుఖవంతమైన ప్రయాణం...
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఎక్కువగా మెట్రో సేవలనే ఉపయోగించుకుంటున్నారు. సామాన్య ప్రయాణికులు కూడా అలవాటు పడ్డారు. దీంతో హైదరాబాద్ లో మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే తాజాగా మెట్రో ఒక రికార్డును సాధించింది. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా చెబుతున్నారు. మొత్తం మూడు కారిడార్‌లలో ఈ ప్రయాణాన్ని హైదరాబాద్ నగర వాసులు కొనసాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన ఆరేళ్లలో రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. ఒకరోజు 5.47 లక్షల మంది ప్రయాణించడమంటే ఆషామాషీ కాదని మెట్రో అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News