Hyderabad : హైదరాబాద్ కు హై అలెర్ట్.. మరో రెండు గంటల్లో దంచి కొట్టనున్న వాన
హైదరాబాద్ కు వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. మరో రెండు గంటల్లో భారీ వర్షం హైదరాబాద్ లో పడుతుంది
హైదరాబాద్ కు వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. మరో రెండు గంటల్లో భారీ వర్షం హైదరాబాద్ లో పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లాలో గంటన్నర నుంచి వర్షం పడుతుంది. హైదరాబాద్ లో కూడా కొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు వర్షం తగ్గేంత వరకూ ఆగితే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి.
నిన్న మూడు గంటలు...
నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకబిగిన వాన కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నిన్న వర్షం దెబ్బకు వర్షపు నీళ్లన్నీ ఇళ్లలోకి చేరాయి. నిన్న హైదరాబాద్ అత్యధికంగా 8.7 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. చాలా చోట్ల విద్యుత్తు సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. మరి ఈ రోజు వరుణుడు హైదరాబాద్ పై ఎంత సేపు పగపడతాడో చూడాలి మరి.