Rain Alert : హైదరాబాదీలకు వార్నింగ్.. ఈరోజు బయటకు వెళ్లకపోవడమే మంచిదట

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది

Update: 2024-08-31 04:06 GMT

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపిింది. దీని ప్రభావంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.

భారీ వర్షాలు...
కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, కొమురం భీం, ఆదిలాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయగా, పదమూడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
హైదరాబాద్ లో...
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమే కాకుండా గంటలకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ మూతలు ఎవరూ తెరవకూడదని హెచ్చరించింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, పురాతన భవనాల నుంచి నివాసాలను ఖాళీ చేయాలని కూడా సూచించింది.


Tags:    

Similar News