సీపీని కలిసిన ఎంఐఎం నేతలు
ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యలేు, ఎమ్మెల్సీలు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిశారు
ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యలేు, ఎమ్మెల్సీలు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిశారు. రంజాన్ మాసం సందర్భంగా రాత్రి వేళ షాపింగ్ కు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. వ్యాపారాలతో పాటు చిరు వ్యాపారులకు కూడా రాత్రి వేళ అనుమతి ఇవ్వాలిని ఎంఐఎం నేతలు సీవీ ఆనంద్ ను కోరారు. ప్రధానంగా పాతబస్తీలో ఈ మాసం అంతా నైట్ షాపింగ్ జరుగుతుందని, స్థానిక పోలీసులు అడ్డు చెబుతున్నారన్న విషయాన్ని వారు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
నైట్ షాపింగ్ కు.....
అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించకుండా, పాతబస్తీలో నైట్ షాపింగ్ కు ఈ రంజాన్ మాసంలో అనుమతిస్తున్నట్లు సీీవీ ఆనంద్ పేర్కొన్నారు. పోలీసులకు సహకరించాలని కూడా ఆయన కోరారు. గత రెండు రోజులుగా వరసగా ఎంఐఎం కార్పొరేటర్లు పోలీసుల విధులను అడ్డుకున్న నేపథ్యంలో ఎంఐఎం నేతలు సీవీ ఆనంద్ ను కలిసి నైట్ షాపింగ్ కు అనుమతి తీసుకున్నారు.