ఢిల్లీ వెళ్లాల్సిన విమానం...ఆలస్యం కావడంతో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆకాశ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు;

Update: 2024-07-22 04:00 GMT
passengers, protest, filght, shamshabad airport
  • whatsapp icon

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆకాశ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బోర్డింగ్ పాస్ లు జారీ చేసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఎంతకూ రాకపోయినా సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

ఐదు గంటలకు...
ఈరోజు ఉదయం ఐదు గంటలకు విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ విమానం రాలేదు. సిబ్బందిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బోర్డిండ్ పాస్ లు ఇచ్చినందున తమను వేరే విమానంలో పంపించాలని వారు కోరుతున్నారు. సిబ్బంది వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


Tags:    

Similar News