ఫుడ్ లవర్స్ కు ఇక పండగే
కేరళకు చెందిన పాత విమానాన్ని పిస్తా హౌస్ 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనిని రెస్టారెంట్ గా మలిచింది.
భోజన ప్రియులకు హైదరాబాద్ అడ్డా అని చెప్పుకోవాలి. హైదరాబాద్ బిర్యాని నుంచి ఎన్నో వెరైటీలు ఫుడ్ లవర్స్ కు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకు చెందిన స్పెషల్ వంటకాలతో రెస్టారెంట్లు నోరూరిస్తూ దర్శనమిస్తున్నాయి. వీకెండ్ లో ఫుడ్ లవర్స్ వెరైటీల కోసం నెట్ లో వెదుకులాట చేస్తుంటారు. కేవలం ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కాదు వెరైటీగా తమకు ఆతిధ్యమిచ్చే రెస్టారెంట్ల కోసం పరితపిస్తుంటారు.
విమానంలో భోజనం...
ఇప్పటి వరకూ ట్రైన్ రెస్టారెంట్, బస్ రెస్టారెంట్, జైలు రెస్టారెంట్ వంటి వాటిని చూశాం. వీటిని కూడా చూసిన భోజన ప్రియులకు తాజాగా మరో గుడ్ న్యూస్. విమానంలో రెస్టారెంట్ ను ఏర్పాటు చేసేందుకు పిస్తా హౌస్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో ఫ్లైట్ లో ఫుడ్ ను ఆస్వాదించేందుకు రెస్టారెంట్ రెడీ అవుతుంది. విమానంలో కూర్చుని భోజనం చేసే అనుభూతిని కల్గించడం కోసం ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు.
పిస్తా హౌస్ ...
కేరళకు చెందిన పాత విమానాన్ని పిస్తా హౌస్ 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనిని రెస్టారెంట్ గా మలిచింది. 150 సీట్లలో రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తుంది. పిస్తా హౌస్ అంటేనే ఫేమస్. మరి అందులోనూ విమానంలో కూర్చుని డిన్నర్, లంచ్ చేస్తే.. అబ్బ.. ఆ అనుభూతే వేరు అన్న తరహాలో రెస్టారెంట్ రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించేందుకు పిస్తా హౌస్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. ఫుడ్ లవర్స్ కు ఇక పండగే.