Moahn Babu : మోహన్ బాబు పోలీసుల గాలింపు
సినీనటుడు మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. జల్పల్లిలోని తన నివాసంలో మీడియాపై జరిగి దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణకు రావాలని కోరగా ఆయన న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు.
తప్పించుకు తిరుగుతుండటంతో...
మోహన్ బాబు స్టేట్ మెంట్ రికార్డు చేయాలని జల్పల్లి లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు మోహన్ బాబు లేకపోవడం కనిపించింది. కుటుంబ సభ్యులు కూడా లేరని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. మరోవైపు హైకోర్టులో మోహన్ బాబు ముందస్తుబెయిల్ ను కొట్టివేయడంతో ఆయన పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నారని తెలిసింది. మోహన్ బాబు కోసం ఐదు చో్ట్ల పోలీసులు గాలిస్తున్నారు.