Big Breaking: చంచల్ గూడ జైలుకు పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ పోలీసులు చంచల్ గూడకు తరలిస్తున్నారు.

Update: 2024-12-13 11:59 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ పోలీసులు చంచల్ గూడకు తరలిస్తున్నారు. చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంథ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టోర్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు పథ్నాలుగు రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకూ అల్లు అర్జున్‌ను జైలులోఉన్నారు.

ప్రత్యేక గది...
సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్‌ను ఉంచే అవకాశాలున్నాయి. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారని జైలు అధికారుల చెబుతున్నారు. అయితే అల్లుఅర్జున్ విఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉందా? లేదా? అన్నది కూడా చూడాల్సి ఉంది. . జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారని న్యాయవాదులు చెబుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News