Sinkhole Causes Panic మియాపూర్ లో ఒక్కసారిగా కుంగిపోయిన భూమి
మియాపూర్‌లోని మదీనాగూడ ప్రధాన రహదారి పై రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డులోని కొంత;
మియాపూర్‌లోని మదీనాగూడ ప్రధాన రహదారి పై రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డులోని కొంత భాగంలో గుంత పడడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ రోడ్డుపై సింక్ హోల్ ఏర్పడింది. 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతులో ఉన్న సింక్‌హోల్ చూసి అటు వైపు వెళ్లాలంటే కొందరు భయపడ్డారు. ఇతరులకు ప్రమాదాలు జరగకుండా వెంటనే బారికేడ్‌లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నిలిపివేశారు అధికారులు.
ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సమీపంలో చాలా పాఠశాలలు ఉన్నాయి. మానగర్, ప్రశాంత్‌నగర్, జెపిఎన్‌ఆర్, బొల్లారం వైపు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. సింక్ హోల్‌ను వెంటనే గమనించడం వలన పెద్ద విపత్తు తప్పింది. రోడ్డుకు ఆనుకుని ఉన్న నాలా పైప్‌లైన్ పగిలిపోవడంతో నీటి లీకేజీ జరిగుంటుందని, భూమి బలహీనపడి కుంగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు మరమ్మతులు ప్రారంభించారు.