Hyderabad :మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉచితంగా నేడు ఇంటి వద్ద చేరుస్తామంటూ?
మద్యం తాగి వాహనాలను ఇంటి వద్దకు చేర్చేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది
మద్యం తాగి వాహనాలను ఇంటి వద్దకు చేర్చేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగాఈరోజు రాత్రి ఉచిత రవాణా సదుపాయాన్నికల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాదాలు జరగకుండా, మద్యం సేవించి పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోకుండా తమ వాహనాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది.
వాహనాలను సిద్ధం చేస్తున్న...
హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో తమ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం నగర వ్యాప్తంగా అందుబాటులో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు ఉంటాయని, మందుబాబులు సొంతవాహనాలు కాకుండా తమ వాహనాల్లో ప్రయాణించి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చని తెలిపింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now