Telangana : వాహనదారులకు గుడ్ న్యూస్
వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది;
తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు నేటి నుంచే అమలులోకి రానుంది. వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను ఆన్ లైన్ ద్వారా చెల్లించి రాయితీని పొందవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.
రాయితీ ఇలా...
టూవీలర్లపై 80 శాతం, త్రీ వీలర్స్ పై 90 శాతం వరకూ రాయితీని ప్రకటించింది. కార్లపై ఉన్న పెండింగ్ చల్లాన్ల విషయంలో యాభై శాతం రాయితీ వర్తించనుంది. హెవీ వెహికల్స్ పై అరవై శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాహనదారులను పోలీసు అధికారులు కోరుతున్నారు. సంవత్సరం చివరి వారం కావడంతో పెండింగ్ చల్లాన్లను చెల్లించి వాహనాలను ధైర్యంగా రోడ్డుపైకి తీసుకెళ్లవచ్చని పేర్కొంటున్నారు.