Hyderabad : నేడు బక్రీద్ .. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఈరోజు ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు;
ఈరోజు ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలను జరుపుకునేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలున్న ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు అది గమనించి అటు వైపు వెళ్లాలని పోలీసులు ముందుగానే సూచిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో...
మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి 11.30 గంల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈదారిలో వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్య స్థానానికి చేరుకోవాలనికోరారు. ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్ పండగ సందర్భంగా హైదరాబాద్ లోని పాతబస్తీలోనూ అనేక రహదారులపై రాకపోకలను నిలిపేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.