రాకింగ్ లుక్ లో అడివి శేష్!

అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరో మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ లుక్ ని రివీల్ చేసారు. 26/11 [more]

Update: 2020-12-17 09:49 GMT

అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరో మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ లుక్ ని రివీల్ చేసారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. అడివి శేష్ మేజర్ లుక్ చెప్పాలంటే రాకింగ్ గానే అనిపిస్తుంది. మేజర్ లుక్ లో అడివి శేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు కూడా. గన్ ఎక్కుపెట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ దింపే మాదిరి అడివి శేష్ మేజర్ లుక్ ని హైలెట్ చేసారు.


అయితే అడివి శేష్ మేజర్ లుక్ చూడగానే అందరికి అయన గత చిత్రం గూఢచారి గుర్తుకు అవస్తుంది. ఈ సినిమాలో గూఢచారి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తుంది. మరి సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో, సేమ్ హీరోయిన్, సేమ్ కాన్సెప్ట్ లా అనిపించడంతో మేజర్ లుక్ చూడగానే గూఢచారి గుర్తొస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులోను అడివి శేష్ రొమాంటిక్ గా కన్నా ఇలాంటి ఆర్మీ, పోలీస్ లుక్స్ కి బాగా సెట్ అవుతాడు. మరి పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మేజర్ సినిమా లుక్ లో అడివి శేష్ శత్రువుల గుండెల్లో ఒణుకు పుట్టించి వాళ్ళ మీదకి గన్ ఎక్కుపెట్టిన లుక్ నిజంగా ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News